తెలుగుకు మించి.. హిందీలో దుమ్మురేపుతున్న రామ్ సినిమా
Recommended Video
తెలుగులో వచ్చిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్ చేయడం సర్వ సాధారణం. కానీ, అంతకంటే ఎక్కువగా హిందీలోకి డబ్బింగ్ చేసేస్తున్నారు కొందరు సినీ ప్రముఖులు. ప్రస్తుతం సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఫిల్మ్ మేకర్స్ ఆ దిశగా తమ వ్యాపార కార్యకలాపాలను సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్‌లో వదులుతున్నారు.

హిందీలోకి డబ్బింగ్
ఇక్కడ హిట్ అయిన సినిమాలతో పాటు, ఫ్లాప్ అయిన చిత్రాలను డబ్బింగ్ చేస్తున్నారు. తాజాగా గత సంవత్సరం తెలుగులో వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ చిత్రం ‘హలో గురూ ప్రేమ కోసమే'ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ సినిమా డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసిన ఆదిత్యా మూవీస్ దీన్ని హిందీలోకి మార్చి ‘‘దుండార్ కిలాడీ '' పేరుతో రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

రికార్డు వ్యూస్
ఈ సినిమా యూట్యూబ్‌లోకి వచ్చిన మూడు రోజుల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ సాధించింది. అలాగే, దాదాపు నాలుగున్నర లక్షల లైకులు అందుకుంది. అంతేకాదు, ఈ సినిమా యూట్యూబ్‌లో ట్రెండ్ అవడంతో పాటు గంట గంటకూ వ్యూస్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోంది. విశేషమేమిటంటే ఈ సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. కానీ, హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు మాత్రం భారీ రెస్పాన్స్ వస్తోంది. తెలుగు చిత్రాలకు హిందీలో బాగా డిమాండ్ ఉంది అనడానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.

తెలుగు వెర్షన్ గురించి..
ఇక, తెలుగు సినిమా విషయానికొస్తే.. రామ్ - అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే . ఈ సినిమాను ‘నేను లోకల్' ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

గతంలో అల్లు అర్జున్
గతంలో యూట్యూబ్‌లో సరైనోడు రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది. ఈ డబ్బింగ్ మూవీని ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు. సరైనోడుకి ఐదు లక్షలకి లైకులొచ్చాయి. అల్లు అర్జున్ నటించిన డీజే కూడా హిందీ వాళ్లకు తెగ నచ్చేసింది. ఆ మూవీకి కూడా 125 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 4.9 లక్షల లైకులు వచ్చాయి. దీంతో వరుసగా రెండు సినిమాలకు యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించిన హీరోగా బన్నీ నిలిచాడు.


Click it and Unblock the Notifications











