రామ్ కొత్త లుక్ అదిరిందిగా..: 'హలో గురూ ప్రేమ కోసమే'లో ఇలా..
'నేను శైలజ' సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన హీరో రామ్.. ఆ తర్వాత 'ఉన్నది ఒకటే జిందగీ'తో కాస్త ఢీలా పడ్డాడు. మంచి అంచనాలే మధ్య విడుదలైన ఈ సినిమా ఎందుకనో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం రామ్ తన ఫోకస్ అంతా తదుపరి ప్రాజెక్ట్ పైనే పెట్టాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ్ రావు దర్శకత్వంలో 'హలో గురూ ప్రేమకోసమే..' అనే సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మార్చి 8న మొదలైంది.
దిల్ రాజు బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తన లుక్ ఎలా ఉండబోతుందో రామ్ తాజాగా రివీల్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఫోటోలో ఫార్మల్ ఔట్ ఫిట్‌లో జెంటిల్‌మెన్ తరహాలో కనిపిస్తున్నాడు రామ్. రామ్ లుక్ పట్ల అభిమానుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











