Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇంట్లో బాటిల్ ఉన్నా కూడా బార్కే వెళతాం.. మన టైమ్ వచ్చింది: రెడ్ ట్రైలర్ లాంచ్‌లో హీరో రామ్
టాలీవుడ్ లో మళ్ళీ బాక్సాఫీస్ సందడి మొదలు కాబోతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన రామ్ రెడ్ సినిమా కూడా మొత్తానికి సంక్రాంతికి ఫిక్స్ అయ్యింది. ఇక ఈ రోజు సినిమాకు సంబందించిన ట్రైలర్ ను AMB సినిమాస్ లో లాంచ్ చేశారు. అలాగే ప్రెస్ మీట్ కూడా నిర్వహించిన చిత్ర యూనిట్ సినిమా విశేషాలను తెలుపుతూ ఆడియెన్స్ మళ్ళీ థియేటర్స్ కు రావాలని కోరుకున్నారు. ఏకా హీరో రామ్ అయితే తన డిఫరెంట్ స్పీచ్ తో వార్తల్లో నిలిచాడు.
ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూ..
రామ్మాట్లాడుతూ... చాలా రోజుల తరువాత థియేటర్స్‌లోకి రావడంతోచాలా కొత్తగా ఉంది. కరోనా కారణంగా ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూవచ్చాము. సినిమా ట్రైలర్చాలా కొత్తగా అనిపించిందని అంటున్నారు. నేను రెండు మూడుసార్లు చూశాను కానీ బిగ్ స్క్రీన్ పై ఇక్కడ చూడగానే కొత్తగా అనిపించింది. ఇక సంక్రాంతికిఈ సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఎప్పుడో విడుదల కావాల్సింది
కారోనాతరువాత మళ్ళీ సందడి మొదలైంది. అన్ని ఓపెన్ అవుతున్నాయి. అలాగే సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ సమయం కోసం గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నామనిచెప్పాడు. ఇక ఫైనల్ గా రిలీజ్ అవుతుందని తెలిశాక చాలా ఆనందంగాఅనిపించిందని. సినిమా విడుదలైతేఒక్కసారిగా పడిన కష్టమంతామరచిపోవచ్చు. దర్శకుడు కిశోరుతిరుమల ఈ సినిమాని చాలా డిఫరెంట్ గా సరికొత్తగా తెరకెక్కించినట్లు రామ్ మాట్లాడాడు.
దర్శకుడు ఈ ప్రాజెక్ట్ చేస్తాడని అనుకోలేదు
కిషోర్ తో మొదట నేను శైలజా ఆ తరువాత ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలు చేశాను. కానీ అలాంటి దర్శకుడు మొదట నా దగ్గరకు రెడ్కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయనచేయగలరా అని అనుకున్నాను.ఎందుకంటె అంతకుముందు ఆయనతో ఇలాంటి థ్రిల్లర్ మాస్సినిమాలు చేయలేదు.అయితే కిషోర్ కథ చెబుతున్నప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్కనిపించింది.
బాటిల్ ఉన్నా కూడా బార్ కే వెళతాం
ఇలాంటి దర్శకులకు డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటేవాళ్ళు చాలా బాగా డైరెక్ట్చేస్తారని అనిపించింది. అయితే ఇంట్లో పూజ గది ఉన్నాగుడికేవెళతాము. స్విగ్గిఉన్నాకూడా రెస్టారెంట్ కేవెళతాం. ఇక ఇంట్లో బాటిల్ ఉన్నా కూడా బార్ కే వెళతాం.. అలాగే టీవిలోఎంత కొత్త సినిమా వచ్చినా కూడా థియేటర్ కు రావాల్సిందే అంటూ.. రామ్ సరికొత్తగావివరణ ఇచ్చాడు. ఈ సినిమాలోనివేతపేతురాజ్పాత్ర చాలా ముఖ్యమైందని చెబుతూలేడి పోలీసాఫీసర్ అనగానేఅందరికి గుర్తొచ్చింది మొదట నివేతనేఅని వివరించాడు.