Don't Miss!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్‌టాప్‌లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
‘రెడ్’ మూవీ ట్రైలర్ విడుదల: రెండు గెటప్‌లలో అదరగొట్టిన రామ్.. ఫినిషింగ్ టచ్ సూపర్
ఈ మధ్య కాలంలో భారీ హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటోన్న సమయంలో.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్. ఈ సినిమాలో అతడి డెడికేషన్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలు చేయాలని భావించిన ఈ హీరో.. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'రెడ్' అనే సినిమా చేస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
రామ్ తన కెరీర్లోనే తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో చేస్తున్న చిత్రం 'రెడ్'. హైదరాబాద్‌లోని ఏఎంబీ థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది. నచ్చిన అమ్మాయి.. కోరుకున్న ఉద్యోగంతో లైఫ్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో హీరో లైఫ్‌లోకి ఓ వ్యక్తి ఎంట్రీతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెబుతూ ట్రైలర్‌ను మొదలవుతుంది. ఇందులో రెండు గెటప్‌లతో రామ్ అదరగొట్టేసినట్లే కనిపిస్తోంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక, చివర్లో బట్టలు లేకుండా కనిపించి హీరో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సొంత బ్యానర్లో స్రవంతి రవికిషోర్ నిర్మించారు. ఈ చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, ఇంతలో కరోనా వైరస్ ప్రభావంతో విడుదల వాయిదా పడిపోయింది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం పలు ఓటీటీ సంస్థలు ఎగబడ్డాయి. కానీ, దీన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని రామ్ పట్టుదలతో ఉన్నాడు. ఇందులో భాగంగానే వచ్చే సంక్రాంతికి దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో మాలవికా, నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.