'రెడ్' సినిమాలో మరో బ్యూటీ.. రామ్ కోసం ఆమెను కూడా పట్టుకొచ్చారుగా!

ఇటీవలే 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్.. ప్రస్తుతం 'రెడ్' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా శరవేగంగా ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. ఈ చిత్రంలో రామ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనుండటం విశేషం.

ఈ మేరకు ఇప్పటికే నివేద పేతురాజ్, మాళవిక శర్మ లను ఎంపిక చేసిన చిత్రయూనిట్.. తాజాగా మరో హీరోయిన్ అమృత అయ్యర్‌ను కన్ఫర్మ్ చేసింది. ఈ మేరకు ఆమె లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ మధ్య తమిళ హీరో విజయ్ సరసన 'బిగిల్' చిత్రంలో నటించిన ఆమెకు టాలీవుడ్‌లో ఇదే ఫస్ట్ మూవీ. ఇక నుంచి ఆమె రెడ్ మూవీ రెగ్యులర్ షూట్‌లో పాల్గొననుంది.

Ram Pothinenis RED: Amritha Aiyer Look released

రామ్ కెరీర్‌లో 18వ సినిమాగా రాబోతున్న ఈ RED (రెడ్) సినిమాలో రామ్ రోల్ చాలా డిఫెరెంట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకలోకంలో ఆసక్తి రేకెత్తించాయి. ఈ పోస్టర్స్‌లో రామ్ మాస్ లుక్ ఆయన అభిమానుల్లో ఆతృతను పెంచేశాయి.

Ram Pothinenis RED: Amritha Aiyer Look released

ఈ సినిమాను తన హోం బ్యానర్ స్రవంతి మూవీస్‌ పతాకంపై రూపొందిస్తున్నాడు రామ్. కిశోర్‌ తిరుమల దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనుండటం విశేషం. ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X