RAPO20: షాకింగ్ లుక్‌లో రామ్ పోతినేని.. బోయపాటి సినిమా కోసం మరి ఇంతలా?
దేవదాసు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లు అంటూ తేడా లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న మూవీలో హీరోగా చేస్తున్నాడు. ఇక బోయపాటి శ్రీను సినిమాల్లో హీరోలకు ఎలాంటి ఎలివేషన్స్ ఉంటాయో తెలిసిందే. అందుకోసం హీరోలు డిఫరెంట్ లుక్ లో కూడా దర్శనం ఇస్తారు. తాజాగా ఈ సినిమాలోని రామ్ పోతినేని లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపడుతున్నారు.
నిర్మాత కొడుకుగా: తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే స్టార్లుగా ఎదిగి స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన రామ్ పోతినేని ఒకరు. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన 'దేవదాసు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రారంభంలోనే పలు హిట్లు కొట్టాడు.

మాస్ హీరోగా: సినీ కెరీర్ స్టార్టింగ్ లోనే దేవదాస్ తర్వాత జగడం, రెడీ, మస్కా వంటి చిత్రాల్లో హ్యాండ్సమ్ లుక్స్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ రాణించాడు రామ్ పోతినేని. ఇక శీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన రెడీ సినిమా అప్పట్లో ఎంతగా హిట్ అయిందో తెలిసిందే. ఓవైపు లవర్ బాయ్ గా ఉన్న కథలు చేస్తూనే మరోవైపు మాస్ హీరోగా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేశాడు రామ్.

డిజాస్టర్ గా: పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ రామ్ పోతినేనికి పూర్తి స్థాయిలో మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. మాస్, క్లాస్ చిత్రాలు చేసుకుంటూ వెళ్లిన రామ్ గతేడాది ది వారియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ బైలింగువల్ మూవీ డిజాస్టర్ టాక్ అందుకుంది.
శ్రీలీల-థమన్: ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా RAPO20. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్ లో తొలిసారిగా వస్తున్న పాన్ ఇండియా మూవీలో బ్యూటిఫుల్ శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. అలాగే థమన్ సంగీతం అందిస్తున్నారు.

స్పెషల్ గ్లింప్స్: RAPO20 సినిమాను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఎప్పటి నుంచి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మే 15న అంటే సోమవారం రామ్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
ఫస్ట్ థండర్: అయితే ఫస్ట్ థండర్ అని టైటిల్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో రామ్ పోతినేని బొద్దుగా ఊహించని విధంగా ఉన్నాడు. ఒక బేస్ బాల్ బ్యాట్ పట్టుకుని రఫ్ లుక్ లో కనిపించాడు. స్లిమ్ గా ఉండే రామ్ ఇలా లావుగా కనిపించేసరికి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. సినిమా కోసం మరి ఇలా చూపించాలా అని కామెంట్స్ చేశారు. అయితే పలువురు మాత్రం లుక్ చాలా బాగుంది, మాసీగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











