ఉప్మా అని ఒక్కసారి పిలిచా అంతే.. అత్తారింటికి దారేదిలో బెస్ట్ సాంగ్.. హీరో రామ్!

యంగ్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం హలో గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం దసరాకనుకగా ఇటీవల విడుదలై విజయం దిశగా దూసుకుపోతోంది. నేను శైలజ తరువాత రామ్ మరో హిట్ అందుకున్నట్లే అని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ చిత్రంలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, ప్రణీత సుభాష్ హీరోయిన్లుగా నటించారు. తాజగా ఈ చిత్ర సక్సెస్ మీట్ జరిగింది.

వాళ్లే చెప్పేస్తున్నారు

వాళ్లే చెప్పేస్తున్నారు

హలొ గురు ప్రేమ కోసమే లాంటి ఎంటర్ టైనింగ్ చిత్రాల టాక్ మనం ప్రత్యేకంగా అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదని హీరో రామ్ తెలిపాడు. ఈ సినిమా గురించి అడిగితే డైలాగులతో సహా చెప్పేస్తున్నారని రామ్ సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రణీతపై దేవిశ్రీ స్పెషల్ ఫోకస్

ప్రణీతపై దేవిశ్రీ స్పెషల్ ఫోకస్

ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ గురించి రామ్ మాట్లాడుతూ.. దేవిశ్రీకి ప్రణీతపై ప్రత్యేక శ్రద్ద ఉన్నట్లు ఉంది అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అత్తారింటికి దారేది చిత్రాల్లో బాపుగారి బొమ్మ అనే బెస్ట్ సాంగ్ ని ప్రణీత కోసం కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలోకూడా ప్రణీత ఉండే సాంగ్ సూపర్ హిట్ అయిందని రామ్ తెలిపాడు.

ఉప్మా అని ఒక్కసారి పిలిచా

ఉప్మా అని ఒక్కసారి పిలిచా

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుతూ.. ఉన్నది ఒక్కటే జిందగీ చిత్ర సెట్ లో అనుపమని ఒక్కసారి ఉప్మా అని పిలిచా. దానిపై ఈ చిత్ర రచయిత ప్రసన్న ఏకంగా ఒక సన్నివేశమే రాసేశాడని రామ్ తెలిపాడు. ఇప్పుడు అందరూ అనుపమని ఉప్మా అని పిలుస్తున్నారని రామ్ తెలిపాడు.

తమ్ముడులాంటి వాడు

తమ్ముడులాంటి వాడు

హలో గురు ప్రేమ కోసమే చిత్ర సక్సెస్ మీట్ కు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దిల్ రాజు తనకు తమ్ముడిలాంటివాడని అల్లు అరవింద్ అన్నారు. దిల్ రాజు యూఎస్ లో ఉండడం వల్ల ఈ ఈవెంట్ కు హాజరు కాలేదు. నాకు ఫోన్ చేసి వెళ్ళమని అడిగాడు. నీవు లేకుంటే వెళ్ళాల్సింది నేనే కదా అని అన్నాను.

ఆమె కళ్ళ గురించే

ఆమె కళ్ళ గురించే

హీరో రామ్ ఈ చిత్రంలో బ్యాలెన్స్ గా నటించాడని అల్లు అరవింద్ తెలిపారు. హీరోయిన్ ప్రణీతని చూస్తే ఎవరైనా ఆమె కళ్ళ గురించే మొదట మాట్లాడుకుంటారని తెలిపారు. చాలా సన్నివేశాల్లో రచయిత రిస్క్ తీసుకుని సీన్స్ రూపొందించారు. అవన్నీ విజయం సాధించాయి.

అందరూ సెలెబ్రేట్ చేసుకోవాలి

అందరూ సెలెబ్రేట్ చేసుకోవాలి

ఇండస్ట్రీలో ఏ చిత్రం విజయం సాధించినా అంతా కలసి సెలెబ్రేట్ చేసుకోవాలని తాను ఎప్పుడూ భావిస్తానని అల్లు అరవింద్ అన్నారు. ఆ ఉద్దేశంతోనే హలొ గురు ప్రేమ కోసమే చిత్ర పసక్సెస్ మీట్ కు హాజరయ్యానని అల్లు అరవింద్ అన్నారు.

క్లీన్ హిట్ దిశగా

క్లీన్ హిట్ దిశగా

దసరా రోజు విడుదలైన హలొ గురు ప్రేమ కోసమే చిత్రం పాజిటివ్ టాక్ తో విజయం దిశగా దూసుకుపోతోంది. రామ్ కెరీర్ లోనే ఈ చిత్రానికి అత్యుత్తమ వసూళ్లు నమోదు అవుతున్నాయి. తొలి వీకెండ్ ముగిసే సమయానికి హలో గురు ప్రేమకోసమే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 22.5 కోట్ల గ్రాస్ రాబట్టడం విశేషం. ఇందులో షేర్ విలువ 14 కోట్ల వరకు ఉంది. వీక్ డేస్ ఓ ఈ చిత్రం ఏమేరకు వసూళ్లు రాబడుతుందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X