Double iSmart ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ మూవీలో హైలైట్ లీక్.. సినిమా ఎలా ఉంటుందంటే!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. కానీ, అందులో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోల్లో రామ్ పోతినేని ఒకడు. ఈ మధ్య కాలంలో తనదైన చిత్రాలతో సందడి చేస్తోన్న అతడు.. ప్రతి సినిమాకూ రేంజ్‌ను పెంచుకునేలా ముందుకు సాగుతోన్నాడు. అయితే, కొంత కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఈ సారి సక్సెస్ కొట్టాలని 'డబుల్ ఇస్మార్ట్' మూవీ చేశాడు. ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి!
డబుల్ ఇస్మార్ట్‌గా రామ్
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ విలన్‌గా, కావ్య థాపర్ హీరోయిన్ చేస్తోంది. అలాగే, అలీ, గెటప్ శ్రీను, షయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందించారు.

ప్రమోషన్స్ జెట్ స్పీడ్
రామ్ నటించిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీని ఈ ఏడాది మార్చిలోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అప్పుడు సాధ్యం కాకపోవడంతో ఆగస్టు 15వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇక, దీనికి సమయం దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడుగా సాగిస్తోంది. ఇలా ఇప్పటికే కొన్ని ఈవెంట్లు, ఇంటర్వ్యూలనూ సైతం పూర్తి చేసింది.

ఆ సర్టిఫికెట్ వచ్చింది
ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో నిర్మాణానంతర కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుంది. ఇలా ఇటీవలే ఈ చిత్రాన్ని సెన్సార్ సభ్యులు వీక్షించినట్లు తెలిసింది. అంతేకాదు, దీనికి సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ (A) సర్టిఫికెట్‌ను జారీ చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగానే వెల్లడించింది.

రన్ టైమ్ ఎంతంటే
రామ్ పోతినేని హీరోగా పూరీ జగన్నాథ్ రూపొందించిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీకి సంబంధించిన రన్ టైం వివరాలు కూడా తాజాగా తెలిశాయి. ఈ సమాచారం ప్రకారం.. ఈ మూవీ 2 గంటల 42 నిమిషాల (162 నిమిషాలు) పాటు ఉండబోతుందని తెలిసింది. అంటే సాధారణంగా వచ్చే సినిమాల కంటే కాస్త ఎక్కువ రన్ టైంతోనే రామ్ పోతినేని చిత్రం వస్తుందని చెప్పాలి.
సెన్సార్ రివ్యూ ఇలా
రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ఫిదా అయ్యారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. గతంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'కు మించిన మాస్ ఫీస్ట్‌ను ఈ చిత్రం అందించబోతుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు అభిప్రాయపడుతున్నారట. మొత్తంగా బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ మెచ్చే సినిమా అవుతుందని చెప్పారని టాక్.

ఇందులో హైలైట్స్
సెన్సార్ సభ్యుల టాక్ ప్రకారం.. 'డబుల్ ఇస్మార్ట్' మూవీలో హీరో ఎనర్జీ, పూరీ జగన్నాథ్ స్టోరీ, డైరెక్షన్, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, సంజయ్ దత్ - రామ్ మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్, క్లైమాక్స్ ట్విస్ట్ హైలైట్లుగా ఉంటాయని తెలిసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











