Skanda Trailer: పులి వేటకొచ్చింది.. ఊరమాస్ లుక్‌లో రామ్ అరాచకం.. ట్రైలర్ ఏముంది భయ్యా!
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్న యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ స్టేటస్‌ను అందుకున్నారు. అలాంటి వారిలో ఉస్తాద్ రామ్ పోతినేని ఒకడు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌తోనే హీరోగా వచ్చిన అతడు.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'స్కంద' మూవీ చేస్తున్నాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తోన్న చిత్రమే 'స్కంద'. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని విడుదలకు రెడీ చేస్తున్నారు.

రామ్ - బోయపాటి శ్రీను కలిసి చేస్తున్న 'స్కంద' సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దీంతో ఇప్పుడు చిత్ర నిర్మాతలు ప్రచారం చిత్రాలపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌లో 'స్కంద ప్రీ రిలీజ్ థండర్' ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన నటసింహా నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'స్కంద' మూవీ ట్రైలర్ 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' అని చెప్పే రామ్ డైలాగ్‌తో ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత అతడి క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ.. ప్రత్యర్థులను పరిచయం చేస్తూ ఇది సాగింది. మరీ ముఖ్యంగా బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ ట్రైలర్‌గా అరాచకంగా ఉంది.
తాజాగా వచ్చిన 'స్కంద' ట్రైలర్‌లో విజువల్స్ ఎంతో రిచ్‌గా ఉన్నాయి. థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రామ్ పలు రకాల గెటప్‌లతో, ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో అతడు ఎవరూ ఊహించని ఊరమాస్ గెటప్‌తో కనిపించి షాకిచ్చాడు. దీంతో ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి.. క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
ఇదిలా ఉండగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న 'స్కంద' సినిమాను శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











