అది సక్సెస్ కాదు.. ఇస్మార్ట్ శంకర్ 50 రోజులు పూర్తి చేసుకోవడంపై రామ్ ట్వీట్

టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఫలితంలో మాంచి ఖుషీ మీద ఉన్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్. గతంలో కొన్ని మంచి చిత్రాలు ఉన్నప్పటికీ, ఈ రేంజ్ హిట్‌ను మాత్రం దక్కించుకోలేకపోయాడు. వాస్తవానికి అందుకు తగ్గట్లే రామ్ ఈ సారి ఎలాగైనా కొట్టాలన్న కసితో తన లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో మార్పులు చేసుకున్నాడు. దీంతో సక్సెస్ అయ్యాడు.

'ఇస్మార్ట్ శంకర్' టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.31.92 కోట్ల షేర్, రూ.54.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్ల గ్రాస్, రూ.4.45 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారు రూ.1 కోటి, గ్రాస్ రూ.2.15 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.34.89 కోట్ల గ్రాస్, రూ.61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయడంతో 202 శాతం లాభాలను రాబట్టింది.

Ram Pothineni Tweet about iSmart Shankar complete 50 days

ఇక తాజాగా ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో హీరో రామ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'ఇస్మార్ట్ శంకర్' 50 రోజుల పోస్టర్‌ను షేర్ చేశాడు. అంతేకాదు, 'ఇది సక్సెస్ కాదు.. మీ కళ్లలో ప్రేమ, హ్యాపీ‌నెస్ చూశాను. అదే నాకు ఆశీర్వాదం' అని రామ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

తనకు 'నేను శైలజ' వంటి సక్సెస్‌ను ఇచ్చిన కిశోర్ తిరుమలతో సినిమాను ప్రారంభించబోతున్నాడు రామ్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ త్వరలో అధికారికంగా ప్రారంభం కానుందని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ సినిమా ప్యూర్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని టాక్. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన నివేదా థామస్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X