For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరో రామ్ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం.. లారీ డ్రైవర్ నుంచి ఉన్నతస్థాయికి అంటూ ఎమోషనల్ ట్వీట్

  |

  కరోనావైరస్ పరిస్థితుల్లో ప్రజలకు, సెలబ్రిటీలకు తీరని విషాదం ఎదురవుతున్నది. ఎవరినీ కదలించిన గుండెను పిండేసే విషాద సంఘటనలు, మనసును తీవ్రంగా కలిచే వేసే దు:ఖ పూరితమైన కథలు ప్రజల హృదయాలను కకావికలం చేస్తున్నాయి. ఫోన్ మోగితే ఎలాంటి వార్త వినివస్తుందనే భయం వెంటాడుతున్నది. ముఖ్యంగా సినిమా ప్రముఖులు మరణిస్తున్న వార్తల నుంచి తేరుకోకముందే.. హీరో రామ్ పోతినేని తన కుటుంబంలో జరిగిన విషాద సంఘటనను పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

  రవికిషోర్‌కు సంతాపం..

  రవికిషోర్‌కు సంతాపం..

  రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావుగారు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. పితృవియోగంతో విషాదంలో మునిగిన నిర్మాత రవికిషోర్‌కు సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు సంతాపం తెలియజేస్తున్నారు.

  రామ్ పోతినేని తాత మరణంతో

  రామ్ పోతినేని తాత మరణంతో

  హీరో రామ్ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకొన్న నేపథ్యంలో ట్విట్టర్‌లో ఎమోషనల్‌గా స్పందిస్తూ.. తాను అమితంగా ప్రేమించే వ్యక్తి, తమ కుటుంబానికి అత్యంత స్పూర్తిగా నిలిచిన తన తాత మరణించారనే విషయాన్ని, బాధను, ఆవేదనను వ్యక్తం చేశారు. అత్యంత పేదరికం నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి సంపన్నుడిగా ఎదిగిన తీరును రామ్ పోతినేని వివరించారు.

  విజయవాడలో లారీ డ్రైవర్‌గా జీవితాన్ని

  విజయవాడలో లారీ డ్రైవర్‌గా జీవితాన్ని

  మా తాత గారి జీవిత ప్రయాణం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకొన్నది. విజయవాడలో లారీ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. కుటుంబాన్ని పేదరికం నుంచి గట్టెక్కించడానికి లారీలోనే పడుకొని కాలాన్ని గడిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆయన గొప్ప మనసు, హృదయం ఉన్న మహారాజు అంటూ తన తాత జీవిత ప్రయాణాన్ని రామ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  మీ కష్టార్జితంతో ఉన్నతస్థాయికి

  మీ కష్టార్జితంతో ఉన్నతస్థాయికి

  రామ్ తన తాత గురించి మరిన్ని విషయాలు పంచుకొంటూ.. మేము అనుభవిస్తున్న ఈ సంపద, విలాసవంతమైన జీవితం నీ పాకెట్ నుంచి వచ్చింది కాదు.. అది మీ కష్టార్జితం, మీరు మీ హృదయం సాధించిన వెలకట్టలేని సంపద అంటూ రామ్ పోతినేని ఎమోషనల్ అయ్యారు.

  జీవితాంతం రుణపడి ఉంటాం

  జీవితాంతం రుణపడి ఉంటాం

  మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు గొప్ప కలను కన్నారు. మీరు కోరుకొన్నట్టే ఈ రోజు మేమంతా గొప్ప హోదాల్లో ఉన్నాం. తాత గారు.. అందుకు జీవితాంతం రుణపడి ఉంటాం. మీరు ఏ లోకాలో ఉన్నా మీ ఆత్మకు శాంతి కలుగాలి అంటూ రామ్ పోతినేని భావోద్వేగానికి లోనయ్యారు.

  Ram Pothineni Emotional Tweet, రామ్ పోతినేని ఇంట విషాదం!! || Filmibeat Telugu
  రామ్ పోతినేని కెరీర్ ఇలా

  రామ్ పోతినేని కెరీర్ ఇలా

  హీరో రామ్ పోతినేని కెరీర్ విషయాని వస్తే.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సంక్రాంతి 2021 రేసులో రెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో తమిళ, తెలుగు సినిమాగా వచ్చే చిత్రంలో ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టితో కలిసి నటిస్తున్నారు.

  English summary
  Ram Pothineni's grandfather passes away due to Illness. He tweeted that, From humble beginnings of a lorry driver in Vijayawada sleeping with lorry tires under your bed to providing & caring for your family,you’ve always had the heart of a King.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X