చేసినవి మూడు సినిమాలే అయినా రామ్ కొచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో అతని పారితోషికం కూడా చుక్కలనంటిందని తెలుస్తోంది. అందులోనూ రామ్ డబ్బులు విషయంలో కరెక్టుగా ఉండే స్రవంతి రవికిషోర్ అన్న కొడుకవటం మరో పాజిటివ్ పాయింట్. ఇక తాజాగా ఎమ్.ఎస్.రాజు నిర్మిస్తున్న మస్కా కోసం అతనికి తొంభై లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. అదెలాగ అంటే మస్కా ఓవర్ సీస్ రైట్స్ ని రామ్ రెమ్యునేషన్ క్రింద తీసుకున్నారు రవికిషోర్.ఆ రైట్స్ తొంభై లక్షలుకి అమ్మారు. అంటే అతని రేటు అంతన్నమాట. ఇక ఎన్నాళ్ళనుంచో ఫీల్డులో ఉంటున్న యంగ్ హీరోలు యాభై లక్షలు చేరుకోవటం గగనంగా ఉన్న టైమ్ లో ఇలా ఒక్కసారిగా ఇంత ఎమౌంట్ తో షాకివ్వటం జరుగుతోంది. మస్కా సంక్రాతి రిలీజ్ గా ప్లాన్ చేస్తున్నారు.చిరకాల విరామం తర్వాత భారీ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ మెగా ఫోన్ పట్టుకుని చేసిన చిత్రం ఇది.