బ్రహ్మానందం కామెడీ తో కాస్కో (“పండుగ చేస్కో” ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : వరస ఫెయిల్యూర్స్ లో ఉన్న రామ్ ..దాదాపు సంవత్సరం పాటు గ్యాప్ తీసుకుని రెడీ చేసిన చిత్రం పండుగ చేస్కో. తన రెడీ, కందిరీగ తరహాలో బ్రహ్మానందంతో కామెడీని గుప్పించి, ఫ్యామిలీలను ఆకట్టుకునేలా రెడీ అయ్యి వస్తున్నాడు. ముఖ్యంగా...బలుపు వంటి హిట్ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేని డైరక్ట్ చేసిన చిత్రం కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే ట్రైలర్స్ సైతం బ్రహ్మానందం పై కట్ చేసి, సినిమా ఫన్ ఎంటర్టైనర్ అనే లుక్ ని తీసుకుని వచ్చారు.

మొన్నామధ్య నాయక్ చిత్రంలో జిలేబిగా కనిపించి, తర్వాత కిల్ బిల్ పాండేగా రేసుగుర్రంలోనూ... రీసెంట్ గా అల్లుడు శ్రీను చిత్రంలో డింపుల్ గా కనిపించిన బ్రహ్మానందం ఆ మధ్యన లౌక్యం... ఇప్పుడు సిప్పీగా మరోసారి నవ్వించారు. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఈ సారి వీకెండ్ వెంకట్రావ్ గా రామ్ తాజా చిత్రం పండుగ చేస్కో లో కనిపించనున్నారని సమాచారం. ఈ పాత్ర కామెడీతో ఇరగ తీస్తుందని చెప్తున్నారు. గతంలో రామ్, బ్రహ్మానందంల కాంబినేషన్ లో వచ్చిన రెడీ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రతో మరో సారి తన ట్రేడ్ మార్క్ ని చూపించి సినిమాకు ప్లస్ అవనున్నాడని తెలుస్తోంది.

Ram's new movie “Pandaga Chesko” Preview

రామ్ పాత్ర చిత్రణ చాలా వైవిధ్యంగా ఉంటుంది. గతంలో లవర్‌బాయ్, మాస్ రోల్స్ చాలా చేసినా ఈ సినిమాలో మాత్రం క్లాస్, మాస్ రెండింటి మేళవింపుతో కూడిన ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. నవతరం యువతకు ప్రతీకలా పాత్ర ఉంటుంది. ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో హీరోను పూర్వీకుల నుంచి ఆస్తిపాస్తులు పొందిన గొప్పవాడిగానే ఎక్కువగా చూపించేవారు కానీ ఇందులో మాత్రం సొంతంగా ఎదగాలని ప్రయత్నించే ఓ ఎన్‌ఆర్‌ఐ బిలియనీర్ యువకుడిగా రామ్ క్యారెక్టర్‌ను సరికొత్త పంథాలో తీర్చిదిద్దారు. రామ్ పాత్ర చిత్రణలో వున్న కొత్తదనం నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.

రామ్ మాట్లాడుతూ... టైటిల్ లోని ఆ పేరులో ఉన్న హుషారు సినిమా మొత్తం ఉంటుంది. పండగ అంటే రంగురంగుల దృశ్యం కళ్లముందు కదలాడుతుంటుంది. ఈ సినిమాలో నా పాత్ర ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుందన్న మాట. అందుకే సినిమాకు ఆ పేరు పెట్టాం అన్నారు.

రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

Ram's new movie “Pandaga Chesko” Preview

దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

Ram's new movie “Pandaga Chesko” Preview

బ్యానర్: యునైటెడ్ మూవీస్
నటీనటులు :రామ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు
కథ: వెలిగొండ శ్రీనివాస్‌,
మాటలు: కోన వెంకట్‌,
రచన సహకారం: అనిల్‌ రావిపూడి,
కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌,
ఎడిటింగ్‌: గౌతంరాజు,
ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,
ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌,
సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం :గోపీచంద్ మలినేని
నిర్మాత: పరుచూరి ప్రసాద్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X