కరుణాకరణ్, రామ్ కాంబినేషన్ సినిమా టైటిల్ మారింది
'తొలిప్రేమ' నుంచి 'డార్లింగ్' దాకా దాదాపు ప్రేమ కథలనే ఎంచుకుంటూ వస్తున్న దర్శకుడు కరుణాకరన్ తాజాగా హీరో రామ్ తో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రానికి 'ఎదురే లేదు' అనే టైటిల్ కూడా పెట్టారదు. అయితే త్వరలో ప్రారంభం అయ్యే ఈ చిత్రానికి టైటిల్ ని ఎందుకంటే గా మార్చినట్లు విశ్వసనీయ సమాచారం.
తమన్నా హీరోయిన్ గా చేసే ఈ చిత్రానికి ఆ మధ్య మన లవ్ స్టోరీ అనే టైటిల్ కూడా అనుకున్నారు. అయితే ఎందుకంటే అనే టైటిల్ పూర్తిగా కథకు సూట్ అవుతుందని కరుణాకరన్ భావించారని చెప్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని ఉల్లాసంగా ఉత్సాహంగా తరహాలో కామిడీ తో కథను నింపారని చెప్తున్నారు. ఇక ప్రస్తుతం రామ్ కందిరీగ అనే టైటిల్ తో చిత్రం చేస్తున్నారు.బెల్లంకొండ సురేష్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











