twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పసిబిడ్డ ప్రాణం కాపాడిన రామ్...సమంత ప్రశంసలు

    By Srikanya
    |

    హైదరాబాద్: తెరమీదే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకున్నాడు హీరో రామ్. ఆయన వంతుగా చేసిన సాయం ఓ పసివాడి ప్రాణం రక్షించింది. వివరాల్లోకి వెళితే...శ్రవణ్ కార్తీక్ 6 నెలల బిడ్డ, తనకి హార్ట్ డిసీస్ ఉండడం వల్ల తను ఆంధ్ర హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఆ బాబుకి ఆపరేషన్ చేస్తే బతుకుతాడు కానీ ఆ బాబు తల్లి తండ్రులకు అంత స్తోమత లేదు. దాంతో సమంత నిర్వహించే ప్రత్యూష ఆర్గనైజేషన్ వారు అందరినీ శ్రవణ్ ని కాపాడమని కోరారు.

    అప్పుడే హీరో రామ్ ముందుకు వచ్చి తన వంతుగా ఆ పసివాడి ఆపరేషన్ కి సరిపడా మనీ ఇచ్చి సాయం చేసాడు. ఈ విషయం గురించి,రామ్ మంచితనం గురించి సమంత తన ట్విట్టర్ ద్వారా మెచ్చుకోవడమే కాకుండా, కృతఙ్ఞతలు చెప్పింది. దాంతో రామ్ సంతోషపడటమే కాకుండా ప్రత్యూష లాంటి ఓ ఆర్గనైజేషన్ ని నడుపుతున్నందుకు ఆమెను మెచ్చుకున్నాడు.

    Ram’s noble gesture saves a child

    ఇక రామ్ చిత్రాల విషయానికి వస్తే...

    రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పండగ చేస్కో' . రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి కిరీటి నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ ''రామ్‌ ఎనర్జీని పూర్తి స్థాయిలో తెరపై చూపించే ప్రయత్నమే ఈ చిత్రం. రకుల్‌ పాత్ర కూడా అదే స్థాయిలో ఉంటుంది. నాయకానాయికలు, బ్రహ్మానందం కలసి తెరపై పండించే వినోదం ప్రేక్షకులను అలరిస్తుంది'' అన్నారు.

    రామ్‌ మాట్లాడుతూ ''చాలా రోజుల నుంచి కష్టపడి చేసుకున్న కథ ఇది. మా యూనిట్ ఎంతో మనసు పెట్టి చేస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.

    ''ఇక్కడ చదివి విదేశాల్లో నాలుగు డాలర్లు సంపాదించుకోవడానికి యువత విదేశాలకు వెళ్లిపోతున్న రోజులివి. ఇలాంటి సమయంలో విదేశాల్లో కోట్లు సంపాదించిన ఓ యువకుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి తన వారి శ్రేయస్సు కోసం ఎలా పోరాడాడు అనేదే చిత్రం'' అన్నారు కథా రచయిత వెలిగొండ శ్రీనివాస్‌.

    రామ్ తో చేయాలని గత నాలుగేళ్లగా ప్రయత్నించాను. ఈ కథ నా దగ్గరకు వచ్చేసరికి పరిశ్రమ పరిస్థితి బాగాలేదని ఆలోచించాను. అయితే కథ బాగా నచ్చేసరికి ముందడుగు వేశాను'' అన్నారు పరుచూరి ప్రసాద్‌.

    చిత్రంలో సాయికుమార్‌, రావు రమేష్‌, జయప్రకాశ్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ.విల్సన్‌, సంగీతం: తమన్‌, కూర్పు: గౌతంరాజు, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌.

    English summary
    Samantha Ruth Prabhu tweeted: "Such a beautiful morning thanks to ramsayz, for helping PratyushaOrg help the child we requested for help for. Lovely person you are"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X