twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టైటిల్ కి తగ్గట్లే... (‘ఒంగోలు గిత్త' ప్రివ్యూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్-కృతి కర్బంద కాంబినేషన్ లో 'బొమ్మరిల్లు' భాస్కర్ రూపొందించిన చిత్రం 'ఒంగోలు గిత్త' . ఈ చిత్రం భారీగా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ చిత్రంపై రామ్ చాలా నమ్మకంగా ఉన్నారు. క్లాస్ చిత్రాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న భాస్కర్ ...ఈసారి మాస్ ప్రేక్షకులను అలరించే దిసగా ఈ చిత్రం రూపొందించారంటున్నారు. మిర్చి యార్డ్ లో జరిగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని దర్శక,నిర్మాతలు హామీ ఇస్తున్నారు.

    చిత్రంలో రామ్ అల్లరి చిల్లర పాత్రలకు కాస్త దూరంగా బాధ్యతలు తెలిసిన యువకుడిగా తొలిసారి కనిపిస్తున్నారు. కృతికర్బందా ఓ పెద్ద మహారాణిలా ఫీలవుతూ ఉంటుంది. పక్కా పొగరున్న అమ్మాయి. అయితే ఏంటట తొక్క! అంటూ పొగరు చూపే నాతో తనకి ఏంటి? అనేది ఆసక్తికం.

    రామ్ మాట్లాడుతూ...''భాస్కర్‌ ఈ కథ చెప్పగానే ఆశ్చర్యపోయా. అందరితో పాటు నేను కూడా ఆయన్ని ఓ క్లాస్‌ దర్శకుడిగానే చూశా. నాకు మాత్రం మాస్‌ కథ చెప్పారు. అయితే... ఆయన శైలి ఎక్కడా విడిచిపెట్టలేదు. తండ్రీ కొడుకుల అనుబంధాల్ని ఆయన కథలో బాగా చూపిస్తారు. ఇందులోనూ ఆ తరహా సన్నివేశాలున్నాయి. నేనెప్పుడూ ఇలాంటి కథలో నటించలేదు. అందుకే భాస్కర్‌తో ఓ మంచి ప్రేమకథా చిత్రం చేయాలనే ఆలోచన పక్కన పెట్టి... ఈ కథకే ఓటేశా'' అన్నారు.

    ''పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమిది. కథ అనుకున్నపుడే రామ్‌ని హీరో అనుకున్నాం. తనకి తగ్గట్టే పాత్ర చాలా వైవిధ్యంగా, హై ఎనర్జీతో ఉంటుంది. కృతి పొగరైన టౌన్‌గాళ్‌ అన్న బిల్డప్‌ ఇస్తూ..అభినయంలో మైమరిపిస్తుంది. రామ్‌-కృతి మధ్య లాలూచి బావుంటుంది. నా ఇమేజ్‌..అనేది పక్కన పెట్టి కొత్తగా చూపించాలి అని చేసిన చిత్రమిది. అలాగే హీరో తండ్రి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నవ్వుల పువ్వులు పూయిస్తాడు. తనని కాస్త న్యూడ్‌గా చూపించినా అదంతా నవ్వులు పంచడం కోసమే. అయితే ఆ సన్నివేశాల వల్ల సెన్సార్‌ 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చింది. అలాగే మణిశర్మ రీరికార్డింగ్‌ అస్సెట్‌. ఓ పాటకి సంగీతం ఇచ్చారాయన. ఇదంతా నాపై అభిమానంతోనే. జానపదుల పాట హైలైట్‌. అలాగే చిత్రనిర్మాతలు బివిఎస్‌ఎన్‌, బాపినీడు సహకారం మరువలేనిది. తప్పక విజయం అందుకుంటాం..'' అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ... : ''ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఓ కుర్రాడి కథ ఇది. ఓ దారి ఎంచుకొన్నాడంటే మధ్యలో ఎవరొచ్చినా సరే.. ఢీకొట్టుకొంటూ వెళ్లిపోతాడు. నా పాత్ర ప్రవర్తించే తీరుకి.. 'ఒంగోలు గిత్త' అనే పేరు సరిగ్గా సరిపోతుంది. ప్రకాష్‌రాజ్‌, ప్రభు, కృతికర్బందలతో నేను నటించే సన్నివేశాలు ఈ కథకు ప్రధానమైన బలం. కృతికి మంచి పాత్ర దక్కింది. తానూ... పొగరున్న యువతిలా బాగా నటించింది. జానపద శైలిలో ఓ గీతాన్ని తెరకెక్కించాం. ఆ పాట ప్రత్యేక ఆకర్షణగా అన్నారు.

    నటీనటులు : రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ తదితరులు
    సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్,
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
    ఫైట్స్: సెల్వ,
    ఫోటోగ్రఫీ: వెంకటేష్,
    ఆర్ట్: కె. కదిర్,
    పాటలు: వనమాలి,
    ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు,
    సమర్పణ: భోగవల్లి బాపినీడు,
    నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్,
    కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

    English summary
    Ram, Kriti Karbandha starrer Ongole Gitta relesing today(1st February). Bommarillu Bhaskar who has done class and family movies like Bommarillu, Parugu and Orange is directing a mass film for the first time. BVSN Prasad producer of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X