twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్‌ 'పండగ చేస్కో' ఉగాది విషెష్ పోస్టర్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగువారి పండుగ ఉగాదిని పురస్కరించుకుని సినిమావాళ్లంతా పోస్టర్ లు,టీజర్స్ వదిలేపనిలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా తాజాగా రామ్ చిత్రం పండుగ చేస్కో కి చెందిన పోస్టర్ ని ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ విడుదల చేసారు. ఇక్కడ మీరు ఆ పోస్టర్ ని చూడవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ చిత్రంలో రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.

    Ram's Pandaga Chesko special Ugadi poster!

    దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత.

    ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. రామ్‌, రకుల్‌, సోనాల్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.

    రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

    English summary
    'Pandaga Chesko' starring Ram and Rakul Preet Singh came up with a new poster on the eve of auspicious Ugadi festival.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X