మెగా హీరో చిత్రానికి ఎనర్జిటిక్ హీరో వాయిస్

By Bojja Kumar

హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'రేయ్' . షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి నిర్ణయించారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఓ సన్నివేశానికి ఎనర్జిటిక్ హీరో రామ్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వైవిఎస్ చౌదరి కోరడంతో వెంటనే వచ్చి వాయిస్ ఇచ్చారు రామ్. గతంలో రామ్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన 'దేవదాసు' చిత్రంతోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Ram’s voice over in Rey

కథానుగుణంగా ఈ చిత్రం ప్రథమార్థం వెస్టిండీస్ సంస్కృతి నేపథ్యంలో, ద్వితీయార్థం అమెరికా సంస్కృతి నేపథ్యంలో ఉంటుంది. ఎఫ్.డి.సి. నిబంధనలకనుగుణంగా అమెరికా, వెస్టిండస్‌లో కొంత భాగం, హైదరాబాద్‌లో అత్యధిక భాగం షూటింగ్ చేశారు. భారీ నిర్మాణ విలువలు, ఆసక్తికరమైన కథాకథనాలతో పాటు అద్భుతమైన వినోదంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.

దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. నరేశ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, తనికెళ్ల భరణి, వేణుమాధవ్, రఘుబాబు, హేమ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సాహిత్యం: చంద్రబోస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X