'దడ' తో పోటీ పడాలని కాదంటున్నాడు
నాగచైతన్య 'దడ', రామ్ కందిరీగ చిత్రాలు ఒక రోజు తేడాలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రిలీజ్ డేట్స్ క్లాష్ గురించే అందరూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. కావాలని రామ్ ఇలా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసాడంటున్నారు.అయితే రామ్ దీనికి ట్విట్టర్ స్పందిస్తూ.. కావాలని నేను 'దడ'తో పోటీ పడటం లేదు. అయినా రిలీజ్ డేట్స్ అనేవి మా చేతిలో ఉండవు. అవి నిర్మాతల ఇష్టం. నేనూ నాగచైతన్య చాలా క్లోజ్ ప్రెండ్స్ మి. ఇద్దరం కలిసి సినిమాలు చూస్తూంటాం. ఇప్పుడు మా ఇద్దరి సినిమాలను కలిసే చూస్తాం అని వవరించాడు.
'కందిరీగ"లోపాత్ర గురించి చెబుతూ..'కందిరీగ" కుడితే నొప్పి పుడుతుంది. ఇందులో నేను కొడితే నొప్పి ప్లస్ నవ్వు రెండూ పుడతాయి. అది గ్యారంటీ. అందుకే అందరూ 'కందిరీగ" కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటుంటారు. నా పాత్రకు కమిట్‌మెంట్, ప్లానింగ్ రెండూ ఉండవు. అప్పటికప్పుడు అనుకున్నది చేసేయడమే. దానికి తోడు నోటి దురదొకటి. మళ్లీ ప్రేమ విషయంలో మాత్రం అతనికి విపరీతమైన గౌరవం ఉంటుంది. అలా చిత్ర, విచిత్రంగా నా పాత్రను డిజైన్ చేశాడు డెరైక్టర్ సంతోష్ శ్రీనివాస్ అన్నారు.


Click it and Unblock the Notifications











