కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అలాంటి చిత్రాన్ని చేస్తున్నాను.. రామ్ షాకింగ్ కామెంట్స్
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరుగులేని హిట్ కొట్టిన ఎనర్జిటిక్ స్టార్ రామ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. నేను శైలజా, ఉన్నది ఒకటే జిందగీ అనే సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ తిరుమలతో RED చిత్రాన్ని ప్రారంభించేశాడు. టైటిల్, ఫస్ట్ లుక్‌తో ఆసక్తిని రేకెత్తించిన చిత్రయూనిట్.. నేడు సినిమాను ప్రారంభించారు.

క్లాప్ కొట్టిన పూరీ, ఛార్మీ
ఇస్మార్ట్ హిట్ కొట్టిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఛార్మీ REDకు క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అభిమానుల కోలాహలం మధ్య అట్టహాసంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీవీఎస్ఎన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నిర్మాత, దర్శకులు మాట్లాడుతూ..
అనంతరం చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ.. తమ బ్యానర్‌లో ఇది మరో మంచి చిత్రంగా నిలుస్తుందని, రామ్‌తో గతంలో తీసిన విధంగా చిత్రాల మాదిరిగానే అందరనీ అలరిస్తుందని అన్నారు. ఓ తమిళ్ మూవీని బేస్ చేసుకుని.. తీస్తోన్న చిత్రమని తెలిపారు. దర్శకుడు కిషోర్ తిరుమల మాట్లాడుతూ.. ఈ మూవీ టైటిల్ డిఫరెంట్‌గా ఉన్నట్లే.. కథ కూడా అలాగే ఉంటుందని, అందరికీ నచ్చే అంశాలు కూడా ఉంటాయని అన్నారు.

హీరో రామ్ మాట్లాడుతూ..
ఇది ముహుర్తమే కాబట్టి ఎక్కవ రివీల్ చేయలేను.. కిషోర్‌తో తనకు ఇది మూడో చిత్రమని, డైరెక్టర్‌గా మా బ్యానర్‌లో ఇది తనకు మూడో చిత్రమని అన్నాడు. అయితే రైటర్‌గా చాలా చిత్రాలకు పని చేశారని గుర్తు చేసుకున్నాడు. ఫస్ట్ టైమ్ నా కెరీర్‌లో ఇలాంటి ఓ చిత్రాన్ని చేస్తున్నాను.. అయితే కమర్షియల్ అంశాలను కూడా మిస్ కాకుండా చూశామంటూ చిత్ర విశేషాలను చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











