ది వారియర్ సెన్సార్ పూర్తి.. తగ్గేదేలే అంటున్న సినిమా యూనిట్!
రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ది వారియర్ సినిమా రిలీజ్ రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటలలో విడుదల కావాల్సిన ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ ఎట్టకేలకు పూర్తయ్యాయి. తాజాగా ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ఖరారు చేసింది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి సినిమా యూనిట్ ను అభినందించినట్లు సమాచారం. సెన్సార్ లో యూఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న సినిమా ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.. శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద నిర్మించబడిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా 14వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.
తమిళంలో, తెలుగులో ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో రామ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా కృతి శెట్టి ఒక రేడియో జాకి పాత్రలో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించగా ఈ సినిమా నుంచి విడుదలైన దాదాపు అన్ని పాటలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. మరీ ముఖ్యంగా బుల్లెట్ బండి సాంగ్ అయితే తెలుగు తమిళ భాషలలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఇక ఈ సినిమా లింగుస్వామి కి మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ట్రైలర్ టీజర్లు సినిమా మీద విపరీతమైన ఆసక్తి పెంచే విధంగా చేశాయి దానికి తగ్గట్టుగా రామ్ వైజాగ్ ఏరియా హక్కులు కొనుగోలు చేసి అన్నపూర్ణ సంస్థతో డిస్ట్రిబ్యూట్ చేయడమే కాక నైజాం హక్కులు కూడా కొనుగోలు చేసి దిల్ రాజు తో కలిసి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వ్యవహారం కూడా ఇప్పుడు హార్ట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 43 కోట్ల పది లక్షల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడంతో 44 కోట్ల రూపాయలకు బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఫిక్సయింది. మరి చూడాలి ఈ సినిమా ఎన్ని కోట్లు కొల్లగొట్టబోతోంది అనేది.


Click it and Unblock the Notifications











