twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జబర్దస్‌' వేణు దాడిపై హీరో రామ్ తీవ్ర ఖండన

    By Srikanya
    |

    హైదరాబాద్ :"మనోభావాలు దెబ్బతిన్నందుకు ఇచ్చిన రియాక్షన్ ...మర్డర్లు,మానభంగాలు చేసినవాళ్లకు ఇస్తే చాలా త్వరగా డవలప్ అవుతాం..." అంటూ రామ్ తీవ్రంగా స్పందించారు వేణు ఎటాక్ పై. కమిడియన్ వేణు పై జరిగిన దాడిపై టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ సైతం ఖండనతో ట్వీట్ చేసారు.

    https://www.facebook.com/TeluguFilmibeat

    మంచు మనోజ్ ట్వీట్ చేస్తూ... ‘ వేణుపై దాడి చేయటం అనేది చాలా చీప్ మరియు అమానవీయ సంఘటన...మనం మొదట మనుష్యులం తర్వాతే ఈ కులాలు,మతాలు అంటూ మండిపడ్డారు.

     Ram tweet on Venu Attack

    నగరంలోని ఫిలింఛాంబర్‌ వద్ద జబర్దస్‌ టీవీ ప్రొగ్రంలో నటించిన వేణు అనే నటుడుపై గౌడ కులస్తులు దాడి చేశారు. తమ కులాన్ని కించపరిచేలా టీవీ ప్రొగ్రాంలో స్కీట్‌ చేశారని వారు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు. ఈనెల 18న రాత్రి ఓ టీవీచానల్‌లో ప్రసారమైన జబర్దస్త్‌ కార్యక్రమంలో గౌడ కులస్తులను కించపరిచే విధంగా ఓ ప్రొగ్రాం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం ఉదయం ఫిలించాంబర్‌ వద్ద వేణుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో వేణుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

    సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు వేణును ఆస్పత్రికి తరలించారు. గౌడ కులం అంటే అంత హీనంగా ఉందా? అని గౌడ కులస్తులు మండిపడ్డారు. ఎవరైనా టీవీలో గానీ, సినిమాల్లో గానీ తమ కులాన్ని కించపరిచేలా చేసేవారికి భౌతిక దాడులు తప్పవంటూ వారు హెచ్చరించారు.

    అయితే ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం తమకు లేదని.. కేవలం ప్రేక్షకుల్ని నవ్వించడానికే స్కీట్‌ చేశామని వేణు మీడియాకి తెలిపారు. ఆ ప్రొగ్రాంలో కులం పేరు ప్రస్తావించలేదని వారన్నారు. తమ ప్రొగ్రాం వల్ల గౌడ కులస్తులు హర్ట్‌ అయితే క్షమాపణలు అని వేణు తెలిపారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఇరు వర్గాలకు చెందిన వారు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదు అయ్యాయి.

    English summary
    Ram Pothineni tweeted.... "Manobhaavaalu dhebbathesinandhuku ichinna Reaction..Murderlu ,Maanabhangaalu chesinavaalaku iste chaala twaraga develop avutham.. #ActorVenu"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X