పెళ్లిలో చాలా మోసం చేశారు.. సునీతపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్
సింగర్ సునీత రెండో పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సునీత రెండో పెళ్లిపై ఎన్ని రకాలుగా పాజిటివ్ కామెంట్లు వచ్చాయో.. అంతే స్థాయిలో నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. అలా మొత్తంగా సునీత పెళ్లి వ్యవహారం ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చల్లోనే ఉంటుంది. అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా సునీత, రామ్ ఇద్దరూ కూడా ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సునీత అలా..
సింగర్ సునీత ఎప్పుడూ కూడా మీడియాకు దూరంగానే ఉంటుంది. సోషల్ మీడియాలో ఏదో అలా అప్పుడప్పుడు పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. కానీ అంతగా యాక్టివ్‌గా ఏమీ ఉండదు. కానీ పెళ్లి తరువాత మాత్రం సునీత ఫుల్ యాక్టివ్ అవుతోంది. పెళ్లి తరువాత ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పేలా కొన్ని పోస్ట్‌లు పెడుతోంది.
పొట్టి దుస్తుల్లో శృతిహాసన్ అందాల ఆరబోత.. గ్లామర్‌తో విజృంభణ

తాజాగా ఇద్దరూ ఒకేచోట..
సునీత ఇన్ని రోజులు తన ఫోటోలు మాత్రమే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. పెళ్లి సమయంలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. వివాహాం తరువాత సునీత షేర్ చేసిన ఫోటోల్లో మాత్రం రామ్ ఎక్కడా కనిపించేవాడు. ఇలా మొదటిసారిగా ఇద్దరూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

సుమ అలరించేసింది..
సునీత, రామ్ వీరపనేనిని యాంకర్ సుమ స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది. మామూలుగానే ఆ ఇద్దరికీ సుమ ఎంతో సన్నిహితురాలు. ఈ ప్రేమికుల రోజున సందర్భంగా రామ్, సునీతలను సుమ ఇంటర్వ్యూ చేసేసింది. ఇందులో ఎన్నో విషయాలను పంచుకున్నారు.

ఏం మాట్లాడాలో..
ప్రతీ సారి రామ్ ఇంకేంటి? ఇంకేంటి? అని అడిగేవారు.. ఆ తరువాత ఏం మాట్లాడాలో నాకు అర్థం అయ్యేది కాదని సునీత చెప్పుకొచ్చింది. ఇంకేంటి?లో ఇంత మీనింగ్ ఉందా? అని సుమ కూడా రివర్స్ కౌంటర్ వేసింది. అయితే పెళ్లి తంతు గురించి మాట్లాడుతూ రామ్ ఓ విషయాన్ని బయటపెట్టేశాడు.

చాలా మోసం చేశారు..
పెళ్లిలో బిందెలో ఉంగరాలు వేసే సమయంలో చాలా మోసం చేశారు. అందరూ ఆడవాళ్లు కలిసి నా చేతిని లాగేశారని రామ్ వీరపనేని చెప్పుకొచ్చాడు. వారంతా నా చెలికత్తెలు అంటూ సునీత మరో పంచ్ వేసింది. మొత్తానికి వీరి ముచ్చట్లు పూర్తిగా బయటకు రావాలంటే రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











