Jr NTRతో సినిమా చేసుంటే శ్రీమంతుడు మహర్షి వచ్చేవి కాదు.. అనుమానించారు: డైరెక్టర్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలోని పెద్ద కుటుంబంలో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తారక్ తనదైన నటన, ఎక్స్ ప్రెషన్స్, డ్యాన్స్, ఫైట్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల RRR మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగి క్రేజీ ప్రాజెక్ట్సుతో బిజీగా ఉన్నాడు. అయితే సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అయినా కొన్ని సార్లు రెజెక్ట్ చేసిన కథలు మరోక కథానాయకుడి చేతిలోకి వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాయి. అలా జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసి ఉంటే శ్రీమంతుడు, మహర్షి వంటి హిట్ చిత్రాలు వచ్చేవి కావంటూ మరికొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డైరెక్టర్ శ్రీవాస్.

భారీ కమర్షియల్ హిట్:కామెడీతో పాటు యాక్షన్స్ సన్నివేశాలను మేళవించి సూపర్ గా ఎంటర్టైన్ చేసే దర్శకుల్లో డైరెక్టర్ శ్రీవాస్ ఒకరు. 2007లో లక్ష్యం మూవీతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టిన శ్రీవాస్ రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టెటర్, సాక్ష్యం వంటి చిత్రాలతో ఎంటర్టైన్ చేశాడు. వీటిలో లౌక్యం భారీ కమర్షియిల్ హిట్ అందుకుంది. మిగిలినవాటిలో కొన్ని పర్వాలేదనిపించుకున్నాయి.

Rama Banam Director Sriwass About Jr NTR And Srimanthudu Maharshi Would Not Released

ఇంట్రెస్టింగ్ విషయాలు:లక్ష్యం, లౌక్యం తర్వాత ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మ్యాచో హీరో గోపీచంద్ తో శ్రీవాస్ తెరకెక్కిస్తున్న మూవీ రామబాణం. నటిసింహం బాలకృష్ణ సజ్జెస్ట్ చేసిన టైటిల్ తో వస్తున్న ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవాస్-గోపీచంద్ కాంబోలో మూడోసారిగా రావడం, బాలయ్య బాబు టైటిల్ చెప్పడంతో రామబాణంపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శ్రీవాస్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

కథపై 20 రోజులు :"లక్ష్యం సినిమా తర్వాత నాతో దిల్ రాజు గారు ఒక సినిమా చేయాలనుకున్నారు. ఆయన 10 నిమిషాలు విని అద్భుతమైన కథ ఇది. మనం చేయాలి. ఎవరికైతే బాగుంటుది అని అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ కు అయితే బాగుంటుందని చెప్పాను. ఒక 20 రోజులు కథ మీద వర్క్ చేసి వస్తానన్నాను. మేమిద్దరం కలిసి వెళ్లి తారక్ కు కథ చెప్పాం. ఆయన కథ విని.. ఇది మాములు కథ కాదు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ రాలేదు. ఇది వందశాతం సమయం తీసుకుని చెయాల్సిన సినిమా" అని అన్నారు అని శ్రీవాస్ తెలిపారు.

Rama Banam Director Sriwass About Jr NTR And Srimanthudu Maharshi Would Not Released

వర్కౌట్ అవుతుందా:"నేను వెంటనే కథపై పనిచేయడం మొదలుపెట్టా. బీవీఎస్ రవి, నేను, రత్నం కలిసి చాలా రోజులు వర్క్ చేశాం. ఈ సమయంలోనే దిల్ రాజు సోదరుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, దాన్ని మా కథలో జోడించాం. కథ చాలా బాగా వచ్చింది. ఫైనల్ కథను తారక్ కు చెప్పాం. కారణాలు ఏంటో తెలియదు కానీ ఎక్కడో చిన్న డౌట్ పడ్డారు. కథ నాకు వర్కౌట్ అవుతుందా లేదా అని అనుమానపడ్డారు" అని డైరెక్టర్ శ్రీవాస్ చెప్పుకొచ్చారు.

పవన్ కు చెబితే:"నాలుగైదు నెలలు పనిచేసిన కథను ఆయన డౌట్ పడి ఇది వేరే హీరో చేస్తే బాగుంటుందని అన్నారు. ఒక్క సెకను నేను బ్లాంక్ అయ్యాను. ఆ కథ నేను ఆరోజు చేసి ఉంటే శ్రీమంతుడు, శతమానం భవతి, మహర్షి కథలు బయటకు రావు. ఇది 2008లో జరిగిన విషయం. తర్వాత ఇదే కథను పవన్ కల్యాణ్ కు చెబితే చాలా ఎగ్జయిట్ అయి కూర్చోని వర్క్ చేద్దాం అన్నారు. కానీ ఆయన పర్సనల్ పనులు, పార్టీ పనుల వల్ల కుదర్లేదు. దీంతో నేను వేరే కథతో రామ్ తో రామరామ కృష్ణకృష్ణ చేసేశాను" అని శ్రీవాస్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X