twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శివరాత్రి జాగారంలో డాన్ శీను పాట.. రైటర్, డైరెక్టర్ ట్వీట్స్ వైరల్

    |

    గోపిచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ అంటే బలుపు, డాన్ శీను వంటి మాస్ ఎంటర్టైనర్ చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఈ రెండు చిత్రాలు మాస్ మహారాజ్‌కు మంచి మైలేజ్ఇచ్చాయి. అటు హీరోగా రవితేజకు, ఇటు దర్శకుడిగా గోపీచంద్ మలినేనికి మంచి పేరును తీసుకొచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి కూడా ఓ ప్రాజెక్ట్‌ను రెడీ చేశారు. అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజను గట్టెక్కించడానికి క్రాక్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

    నేటికి డాన్ చిత్రం విడుదలై.. పదేళ్లు కావొస్తోంది. ఈ మేరకు డాన్ శీను చిత్రం గురించి దర్శకుడు, పాటల రచయిత నాటి విశేషాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. పదేళ్ల డాన్ శీనుపై గోపీచంద్ మలినేని స్పందిస్తూ.. మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ మీరు డైరెక్టర్‌గా నాకు జన్మను ఇచ్చారు. ఎప్పుడూరుణపడే ఉంటాను. నా జీవితాంతం డాన్ శీను చిత్రం ప్రత్యేకంగా గుర్తుండిపోతుంద'ని ట్వీట్ చేశాడు.

    Rama jogaiah Sastry Tweet Don Seenu Completes 10 year

    ఇక పాటల రచయిత రామ జోగయ్యశాస్త్రి ఈ చిత్ర విశేషాల గురించి చెబుతూ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. గుర్తుందా గోపీ..మణిశర్మ అన్నయ్యతో కంపోజింగ్..శివరాత్రి జాగారంలో ఒక పాట పూర్తి చేశాం...డాన్ శీను వచ్చి అప్పుడే 10 ఏళ్లయిందా అంటూ రామ జోగయ్య ట్వీట్ చేయగా.. ఎలా మరిచి పోతాం శాస్త్రి గారు!! అడుగడుగున నాతో ఉన్నందుకు సదా కృతజ్ఞుడిని అంటూ గోపీచంద్ రిప్లై ఇచ్చాడు. ఇక అభిమానులు మాత్రం క్రాక్ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

    English summary
    Rama jogaiah Sastry Tweet Don Seenu Completes 10 year. My dear mass maharaj RaviTeja_offl u gave me birth as a director ... always grateful and love u Red heartHugging face #Donseenu is always special for my lifetimeTwo hearts ##10YearsForDonSeenu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X