హీరో నందు.. నీ ప్రవర్తన దారుణం.. తప్పించుకు తిరగడం సరికాదు.. నిర్మాత ఫైర్

By Rajababu

సన్నీ విన్నీ క్రియేషన్స్ పతాకంపై నందు, అనురాధా జంటగా నటిస్తున్న చిత్రం ఐందవి. హార్రర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ఫణిరామ్ తూఫాన్ ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీధర్ నిర్మాత. హీరో నందు, అనురాధ నటించిన ఐందవి చిత్ర ఆడియో వేడుక సోమవారం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న నటుడు కాదంబరి కిరణ్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసి యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి వెంకట్, తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణ గౌడ్, రామసత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ....నేటి ట్రెండ్ కు తగినట్లు ఉండే సినిమా ఇది అన్నారు. ఐందవీ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి నందు హాజరుకాకపోవడంపై నిర్మాత రామకృష్ణగౌడ్ ఫైర్ అయ్యాడు. కొత్త నిర్మాతతో ఓ హీరో అనుసరించే తీరు కాదని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

హీరో నందు తీరు దురదృష్టకరం

హీరో నందు తీరు దురదృష్టకరం

తెలుగు సినిమా పరిశ్రమలో దురదృష్టకరమైన విషయం కనిపిస్తున్నది. ఐందవి చిత్రంలో నటించిన హీరో నందు ఆడియో ఫంక్షన్‌కు రాకపోవడం చాలా దారుణం. కొత్త నిర్మాత, దర్శకుడికి అండగా ఉండాల్సిన ఆయన తీరు అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఏమైనా పెద్ద హీరో కాడు. కానీ నిర్మాత ఎవరైనా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత నందుపై ఉంది.

నిర్మాత కష్టపడి సినిమా తీస్తే

నిర్మాత కష్టపడి సినిమా తీస్తే

నందును నమ్మి ఎంతో కష్టపడి నిర్మాతలు సినిమాను తీస్తున్నారు. ఎంతో డబ్బు పెట్టి సినిమా తీయడం ఈ రోజుల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆడియో వేడుకకు రాకపోవడం చాలా బాధ్యతారాహిత్యం అని అనుకోవచ్చు.

ఇబ్బంది పెడుతున్న నందు

ఇబ్బంది పెడుతున్న నందు

గత నెలన్నర రోజులుగా నిర్మాతను ఇబ్బంది పెడుతున్నట్టు నాకు తెలిసింది. పలుమార్లు వేడుకకు రావాలని అడిగితే తప్పించుకొని తిరుగుతున్నాడని తెలిసింది. ఊర్లో లేను, బిజీగా ఉన్నాను అని అంటూ ముఖం చాటేశాడట.

రామానాయుడు.. చిరంజీవి కూడా

రామానాయుడు.. చిరంజీవి కూడా

ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలందరూ, రామానాయుడు లాంటి వాళ్లు చిన్న సినిమాలతోనే సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. చిరంజీవి లాంటి వాళ్లే చిన్న చిత్రాలతో కెరీర్ ఆరంభించారు. నందు నీవు చేసేది కరెక్ట్ కాదు. ఇకనైనా సినిమా ప్రమోషన్‌కు రావాలి. ఇంకా నీ ప్రవర్తన మార్చుకోకపోతే క్షమించారు. నిర్మాతకు అండగా నిలువాల్సిన నీవు ఇలా చేయడం తప్పు.

 సినిమా ప్రమోషన్స్‌కు రావాలి

సినిమా ప్రమోషన్స్‌కు రావాలి

ఎక్కడో ముంబైలోనూ మరోచోట ఉండే హీరోయిన్లు ప్రమోషన్స్‌కు వస్తున్నారు. మీలాంటి వాళ్లు ఇలా చేయడం సరికాదు. ఇక నుంచైనా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలి. సినిమా హిట్ అయితే హీరోకే ముందు పేరు వస్తుంది. నిర్మాతకు లాభం వచ్చి మరో సినిమా చేయాలంటే మీలాంటి హీరోల సహకారం ఉండాలి.

Recommended Video

Kannullo Nee Roopame Movie Press Meet
తగిన న్యాయం చేస్తామని..

తగిన న్యాయం చేస్తామని..

హీరో నందు గానీ, మరెవరైనా ప్రమోషన్స్ రాకపోతే చెప్పండి. మీకు తగిన న్యాయం చేస్తాం. ఛాంబర్ అగ్రిమెంట్‌లోనే ఉంది. నిర్మాతలకు పూర్తి అధికారం ఉంటుంది. మీకు ఎలాంటి సహకారం కావాలన్న మేమంత అండగా ఉంటాం. హీరో నందుతో మాట్లాడి మీకు సరైన న్యాయం చేస్తాం అని సీనియర్ నిర్మాత రామకృష్ణగౌడ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X