twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామానాయుడు, నాగేశ్వరరావు డుమ్మా, కారణమేంటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: దాదా సాహెబ్ పాల్కే అవార్డు గ్రహీతలు, తెలుగు సినిమా ప్రముఖులు నిర్మాత రామానాయుడు, నటుడు అక్కినేని నాగేశ్వరరావు గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి డుమ్మా కొట్టారు. 44వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-2013 నవంబర్ 20 ప్రారంభమైంది. ఈ రోజు(నవంబర్ 30)తో ఫిల్మ్ ఫెస్టివల్ ముగియనుంది.

    రామానాయుడు, నాగేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన 'ప్రేమ్ నగర్' చిత్రం ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఈ మేరకు వీరికి ప్రత్యేక ఆహ్వానం పలికారు. వీరిని సన్మానించేందుకు కూడా ఏర్పాట్లు చేసారు. అయితే ఇద్దరూ కూడా అనారోగ్యం కారణంగా ఈ ఫిల్మ్ పెస్టివల్‌కి హాజరు కాలేక పోయారు.

    నాగేశ్వరరావు ఇటీవల క్యాన్సర్ బారిన పడటంతో...ఆయన శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించేందుకు శస్త్ర చికిత్స చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు. వయసు పైబడటంతో రామానాయుడు ఆరోగ్యం కూడా ఏమంత బాగోలేదని సమాచారం. ఈ కారణంగానే ఈ ఇద్దరు తెలుగు సినిమా లెజెండ్స్ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరు కాలేదు.

    నాగేశ్వరరావు వయసు ఇటీవలే 90 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ ఆయన చురుకుగా ఉంటూ సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఆయన 'మనం' చిత్రంలో తన నట వారసులు నాగార్జున, నాగచైతన్యలతో కలిసి నటిస్తున్నారు. ఇక 77 ఏళ్ల రామానాయుడు ఇప్పటికీ నిర్మాతగా తన సత్తా చాటుతున్నారు.

    English summary
    Both Rama Naidu and ANR did not go to the 44th International Film Festival of India (IFFI)-2013 owing to ill-health. "They said they would felicitate both of us but I expressed my inability to attend the festival. It was indeed an honour," Rama Naidu said. The film festival began on November 20.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X