For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SS Rajamouli ని ఎక్కి తొక్కేస్తాం.. కనీసం చెక్కుపై సంతకం పెట్టడం రాదు, మతిమరుపు: రమా రాజమౌళి కామెంట్స్

  |

  దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వీలైనంత వరకు కమర్షియల్ ఎలిమేంట్స్ తోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలు తెరకెక్కిస్తారు. ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి దర్శకుడిలో కూడా అందరిలో ఉన్నట్లు గానే కొన్ని వీక్ నెస్ లు ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన సతీమణి రమా రాజమౌళి ఆయన మైనెస్ పాయింట్స్ ను చాలా ఓపెన్ గానే బయటపెట్టేశారు.

  అంత పెద్ద దర్శకుడు.. చిన్న పిల్లడిలా

  అంత పెద్ద దర్శకుడు.. చిన్న పిల్లడిలా

  రాజమౌళి దేశంలో నెంబర్ వన్ డైరెక్టర్, బాహుబలి కంటే మరో పెద్ద సినిమా RRRను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రేపు హాలీవుడ్ లో కూడా సత్తా చాటడం కాయం. అలాంటి దర్శకుడు పర్సనల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉంటాడు అంటే ఎవరైనా నమ్మగలరా? ఆయన ఏ స్థాయికి వెళుతున్నా కూడా ఇంట్లో మాత్రం ఒక చిన్నపిల్లాడి మనస్తత్వంతో ఉంటారని ఆయన సతీమణి మాటలతో అర్ధమయ్యింది.

   జక్కన్న సీక్రెట్స్ బయటపెట్టిన సతీమణి

  జక్కన్న సీక్రెట్స్ బయటపెట్టిన సతీమణి

  ఒక ఇంటర్వ్యూలో రమా రాజమౌళి దర్శకధీరుడి మైనెస్ పాయింట్స్ అన్ని కూడా బయట పెట్టేశారు. జక్కన్నకు కెరీర్ మొదటి నుంచి కూడా కేవలం సతీమణిగానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా వర్క్ చేస్తున్నారు. మేకింగ్ విషయంలో కూడా ఆమె పాత్ర చాలానే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలో రమా జక్కన్న సీక్రెట్స్ చాలానే బయటపెట్టేసింది.

  జక్కన్నలో గజినీ..

  జక్కన్నలో గజినీ..

  రాజమౌళిలో ఒక గజిని ఉన్నాడని ఎవరైనా ఉహించగలరా? వరుస విజయాలు అందుకున్నప్పటికి పర్సనల్ లైఫ్ లో మాత్రం రాజమౌళి తీరు చాలా విచిత్రంగా ఉంటుందట. ఎవరైనా ఇంటికి వెళితే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎదో ఒకటి జేబులో పెట్టుకొని వచ్చేస్తాడట. ఒకసారి రీమేట్, మరొకసారి కారు తాళాలు కూడా జేబులో వేసుకొని వచ్చినట్లు రమా వివరణ ఇచ్చారు.

  ఏడాది మిస్సయితే.. రాజమౌళి జేబులోనే..

  ఏడాది మిస్సయితే.. రాజమౌళి జేబులోనే..

  ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించలేదు అంటే అందరూ రాజమౌళి వైపే చూస్తారట. నంది(రాజమౌళి ముద్దు పేరు) జేబులో చూడండి అంటూ సెటైర్స్ కూడా వేస్తుంటారట. ఆ స్థాయిలో జక్కన్నకు మతిమరుపు ఉంటుందట. కానీ వర్క్ విషయానికి వచ్చేసరికి మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తాడని రమా తెలిపారు.

   జేబులో డబ్బులు కూడా ఉండవు..

  జేబులో డబ్బులు కూడా ఉండవు..

  రాజమౌళి డబ్బుల విషయాన్ని పెద్దగా పట్టించుకోడు. అన్ని నేనే చూసుకుంటాను. పొరపాటున ఎవరైనా బయటకు తీసుకువెలితే కూడా బిల్లు ఎదుటివాళ్లే కట్టాలి. నేనే అప్పుడప్పుడు డ్రైవర్ దగ్గర డబ్బులు, ఏటీఎం కార్డ్ పెడతాను. కనీసం చెక్కు మీద సంతకం కూడా సరిగ్గా చేయడం రాదు. ఆటోగ్రాఫ్ పెట్టినట్లు పెట్టేస్తాడు. దీంతో ఆ చెక్కులు క్యాన్సిల్ అవుతుంటాయి.. అని రమా వివరణ ఇచ్చారు.

  Actor Altaf Hassan About His Struggles | Battala Ramaswami Biopikku
   అందరం ఎక్కి తొక్కేస్తాం..

  అందరం ఎక్కి తొక్కేస్తాం..

  ఇక చాలా సందర్భాల్లో మేమే ఆయన సినిమాలపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. బయట ఎవరు చేయని రేంజ్ లో విమర్శలు చేస్తాము. ఏ క్రిటిక్స్ కూడా మాతో పోటీకి రాలేరు. కాస్త తేడా కొట్టినా కూడా అందరం ఎక్కి తొక్కేస్తాం. ఇక పిల్లలు అయితే చాలా ఎడిపించేస్తారు. దాన్ని కవర్ చేసేందుకు రాజమౌళి ఏదేదో వేషాలు వేస్తుంటాడు.. అని రమా రాజమౌళి సరదాగా వివరణ ఇచ్చారు.

  English summary
  Rajamouli is one of the best Director ln india. There are some weekly nessers in such a director. In an interview, Rama Rajamouli was openly opened his minus points.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X