డబ్బులిచ్చి ఆడించలేదు..జెన్యూన్ హిట్: దిల్ రాజు
ఏ మాత్రం నష్టం అనేది లేకుండా 52 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది మా 'రామ రామ కృష్ణ కృష్ణ'. మా సంస్థలో వచ్చిన సినిమాల రిపోర్ట్ ఇప్పటి వరకూ జన్యూన్‌గా తెలిపాం. డబ్బులిచ్చి ఆడించడం మాకు తెలీదు. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం కుటుంబ ప్రేక్షకులే. మా సంస్థ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం' అని అన్నారు 'దిల్'రాజు. రామ్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దిల్‌రాజు పై విధంగా స్పందించారు. హీరో రామ్ మాట్లాడుతూ..."దిగ్విజయంగా 50 రోజులు పూర్తవ్వడం చాలా ఆనందంగా వుంది. ప్రేక్షకులకు కృతజ్ఞతలు. యూనిట్ సభ్యులకు అభినందనలు' అన్నారు. దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ...విజయవంతమైన చిత్రాన్ని తీయడానికి అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్ రాజుకు, సహకరించిన సాంకేతిక నిపుణులకు థ్యాంక్స్ అన్నారు.


Click it and Unblock the Notifications











