'రామ రామ కృష్ణ కృష్ణ' టైటిల్ జస్టిఫికేషన్ అదా?
రామ్ హీరోగా దిల్ రాజు రూపొందిస్తున్న చిత్రం 'రామ రామ కృష్ణ కృష్ణ'. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తయారవుతున్న ఈ చిత్రంలో ఆ టైటిల్ గురించి ఆయనే మీడియాకు చెప్పారు. ఆయన మాట్లాడుతూ..." హీరో...నాన్న రామ భక్తుడు..అమ్మ కృష్ణ భక్తురాలు. ఆ దైవాల సారం హీరో పాత్రలో ఉంటుంది. అలాగే విలన్స్ తో అతను ఆడుకునే విధానం కూడా వైవిధ్యంగా ఉంటుంది అన్నారు. ఇక ఎంఎం కీరవాణి సంగీతం అందించిన చిత్రం ఆడియోను ఈ నెల 9న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు మీడియాకు తెలియచేసారు. అలాగే ప్రియా ఆనంద్, బిందు మాధవి ఇందులో హీరోయిన్స్ గా చేస్తున్నారు. సీనియర్ హీరో అర్జున్ పాత్ర ఇందులో కీలకమైన పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం వచ్చే నెలలో సినిమాను విడుదల కానుంది.
రామ రామ కృష్ణ కృష్ణ రామ్ దిల్ రాజు లక్ష్యం శ్రీవాసు ప్రియా ఆనంద్ బిందు మాధవి లీడర్ rama rama krishna krishna ram dil raju lakshyam sri vasu priya anand


Click it and Unblock the Notifications