నాగార్జున, స్నేహా జంటగా కె.రాఘవేంద్రరావు రూపొందించిన చారిత్రిక చిత్రం' శ్రీరామదాసు' ఇప్పుడు ఆరు భాషల్లోకి డబ్బింగ్ అవుతోంది. తమిళం, హిందీ, మళయాళం, మరాఠి, గుజరాతీ, భోజపురి ప్రేక్షకులను ఈ రామ భక్తుడు శ్రీరామదాసు కథ పలకరించబోతోంది. అంటే దాదాపు దేశమంతటా మన నాగార్జున తిరిగి రామ నామ సంకీర్తన చేయబోతున్నాడన్నమాట. అక్కినేని, ఎస్పీ బాలసుబ్రమణ్యం, కీరవాణి, ఆర్.నారాయణ మూర్తి, జె.కె.భారవి, కనుమూరి బాపిరాజు, రఘువీరా రెడ్డి తదితర రాజకీయ, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమ ప్రారంభ పూజ హైదరాబాద్ లో జరిగింది. మొదటిగా తమిళం, హిందీ భాషల్లోకి డబ్బింగ్ చేస్తారట.ఇది వర్కవుట్ అయితే అన్నమయ్య కూడా ప్రపంచ యాత్ర కి బయిలుతేరుతాడు. అభిమానులకు పండుగ కదా.