twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "నవ్వుతూనే వార్నింగ్.. సిచ్యువేషన్ డేంజర్.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు"

    నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారని.. సినిమా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తాను కాంప్రమైజ్ అయ్యేది లేదని తెగేసి చెప్పారు వర్మ.

    |

    విజయవాడ: వివాదం తన ట్యాగ్ లైన్ అన్నట్టుగా వ్యవహరించే వర్మ ప్రస్తుతం 'వంగవీటి' సినీ వివాదంలో తలమునకలైన సంగతి తెలిసిందే. సినిమాను-వివాదాన్ని సమాంతరంగా తెరపై ఆవిష్కరించడం కత్తి మీద సాము లాంటిది. అలాంటి కత్తిసాములన్నెంటినో వర్మ ఇప్పటిదాకా సమర్థవంతంగా ఎదుర్కోగలిగాడు. ఇప్పుడు 'వంగవీటి' విషయంలోను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మరోసారి సవాల్ చేస్తున్నాడు.

    వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారిలతో భేటీ :

    వంగవీటి వివాదం నేపథ్యంలో.. వంగవీటి కుటుంబ సభ్యులైన రాధా, రత్నకుమారిలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వర్మ. సినిమాలో ఉన్న కంటెంట్ గురించి పూర్తిస్థాయిలో వర్మ వారిద్దరికి వివరించారు. సినిమాలో దివంగత రంగా, విజయవాడ మాజీ ఎమ్మెల్యే రాధాల పాత్రను తాను ఎలా రూపొందించింది వర్మ వారితో చెప్పారు. భేటీలో వారి సందేహాలకు, ప్రశ్నలకు వర్మ తనదైన శైలిలో సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది.భేటీలో వర్మతో పాటుగా వంగవీటి నిర్మాత దాసరి కిరణ్ కుమార్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా పాల్గొన్నారు. భేటికి కొడాలి నానినే మధ్యవర్తిగా వ్యవహరించడం గమనార్హం.

    భేటీ అనంతరం వర్మ సంచలన ట్వీట్:

    భేటీ అనంతరం వర్మ సంచలన ట్వీట్:

    రాధా, రత్నకుమారిలతో భేటీ సందర్బంగా.. ఏం మాట్లాడారన్నది అధికారికంగా తెలియనప్పటికీ.. భేటీ అనంతరం వర్మ చేసిన ట్వీట్ బట్టి చూస్తే.. భేటీ ఆసాంతం ఇరువురి మధ్య వాడి-వేడి చర్చ జరిగినట్టు అర్థమవుతోంది.ఇదే విషయాన్ని వ్యక్తపరుస్తూ.. తాను ఇప్పటివరకు ఎన్నో బెదిరింపుల్ని చూసుంటానని, తొలిసారిగా నవ్వుతూ ఇచ్చిన సీరియస్ వార్నింగ్ మాత్రం ఇదేనని భేటీ అనంతరం వర్మ ట్వీట్ చేశాడు. రాధా-రత్నకుమారిలతో మీటింగ్ ఆశించిన రీతిలో జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

    బెదిరింపులకు తలవంచే ప్రసక్తే లేదు..:

    వివాదాల విషయంలో వర్మ తొలినుంచి ఎంత మొండిగా ముందుకెళుతున్నాడో.. ఇప్పుడు వంగవీటి విషయంలోను అదే చేయబోతున్నాడు. రాధా-రత్నకుమారిలతో భేటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్మ.. సినిమా విషయంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని.. అయినా తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తనదైన శైలిలో ట్వీట్ ద్వారా ప్రకటించేశాడు.

    ఇప్పటిదాకా వర్మ ఎన్నో వివాదస్పద సినిమాలను

    తెరకెక్కించినా.. వంగవీటి విషయంలో మాత్రం వాటన్నింటిని మించిన హైడ్రామా కొనసాగుతోంది. ప్రస్తుత సినిమా వివాదం గురించి చెబుతూ.. డేంజరస్ సిచ్యువేషన్ అంటూ వర్మ ట్వీట్ చేశారంటే.. రాధా వైపు నుంచి వర్మకు ఎలాంటి కౌంటర్ పడిందో అర్థం చేసుకోవచ్చు.వివాదానికి సంబంధించి కొంతలో కొంత వర్మకు ఊరటనిస్తున్న అంశం ఏంటంటే.. రాధా-రంగా మిత్రమండలికి చెందిన కొంతమంది వర్మకు మద్దతుగా నిలవడం. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇద్దరు కీలక వ్యక్తులు మాత్రమే తనను ఇబ్బందిపెడుతున్నారని, రాధా-రంగా మిత్రమండలి తనకు మద్దతుగా ఉందని ట్వీట్ ద్వారా తెలిపాడు.

    ఫైనల్ గా చెప్పేదొక్కటే..

    ఫైనల్ గా చెప్పేదొక్కటే..

    సినిమా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తాను కాంప్రమైజ్ అయ్యేది లేదని తెగేసి చెప్పారు వర్మ. సినిమాకు సంబంధించి తన ఆలోచనల్లో ఎలాంటి మార్పు ఉండబోదని కుండబద్దలు కొట్టేశారు. వివాదం సంగతెలా ఉన్నా.. దీని ద్వారా సినిమాకు మాత్రం ఫుల్ పబ్లిసిటీ అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    English summary
    I never step back, these are the words from controversial director Ramgopal varma over the issue of VANGAVEETI film. After the meet with Radha and Ratnakumari he responded through twitter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X