ఎన్టీఆర్ ‘రామయ్యా వస్తావయ్యా’ఇప్పుడు ఎక్కడ?
ఇటీవల మైసూరు సమీపంలోని ఓ టెంపుల్‌లో ఎన్టీఆర్ పాల్గొనగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఫైట్ సీన్స్ షూట్ చేసారు. తాజా షెడ్యూల్ కేరళలోని పొల్లాచ్చిలో చేయబోతున్నారు. అక్కడ కొన్ని ఛేజింగ్ సన్నివేశాల్ని ఎన్టీఆర్‌పై చిత్రీరించడానికి దర్శకుడు హరీష్‌శంకర్ ప్లాన్ చేస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
'బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా..నన్ను అలా పిలవాలంటే ఓ అర్హత వుండాలి. లేదా నా అభిమాని అయివుండాలి...అంటూ టీజర్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమా వుంటుందని నిర్మాత హామీ ఇస్తున్నారు.
ఎన్టీఆర్ సెంటిమెంట్‌గా భావించే సెప్టెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, ఛాయాక్షిగహణం: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: అవినాష్ సైలా, స్క్రీన్‌ప్లే: రమేష్‌డ్డి, వేగేశ్న సతీష్.


Click it and Unblock the Notifications












