'బుడ్డోడంటే గుడ్డలూడిదీసి కొడతా!'...ఎవరికి వార్నింగ్?
ఎన్టీఆర్ తాజా చిత్రం రామయ్యా వస్తావయ్య చిత్రం టీజర్ ని పుట్టిన రోజు కానుకగా విడుదలై అభిమానులకు మంచి ఊపు ఇస్తోంది. అయితే ఎవరిని ఉద్దేశించి ఎన్టీఆర్ ఈ డైలాగు అన్నాడన్నది అంతటా క్వచ్చిన్ మార్క్ గా మారింది. ఎవరికి ఎన్టీఆర్ ఇలా వార్నింగ్ ఇచ్చారు.. అనేది అంతా చర్చనీయాంసమైంది.
సమంత హీరోయిన్. శ్రుతిహాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో నాయకానాయికలపై కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ''బృందావనంలో ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించాం. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ని వైవిధ్యభరితమైన పాత్రలో ఆవిష్కరించబోతున్నాం. ఆయన అభిమానులు ఏం కోరుకొంటున్నారో అవన్నీ ఈ కథలో మేళవించాం. ఎన్టీఆర్, సమంతలపై తెరకెక్కించిన సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి''అన్నారు.
ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడు దల చేయనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తొలిహిట్ చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్ రిలీజైన తీదీ ఇది. ఈ సెంటిమెంట్ కలిసి వచ్చేలా రిలీజ్ డేట్ ని దర్శక,నిర్మాతలు ఫిక్స్ చేసారు.


Click it and Unblock the Notifications












