పవన్ కళ్యాణ్‌ను కెలకమాకు: వర్మకు రామజోగయ్య శాస్త్రి వార్నింగ్

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద ఏదో ఒక కామెంట్ చేస్తూ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.... మరోసారి ట్విట్టర్లో ఆయన్ను కెలికారు. పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుమల పర్యటనకు మెట్లదారిలో వెళ్లిన సంగతి తెలిసిందే. కొండెక్కి అలసిపోయి కుర్చీలో కూర్చున్న పవన్ ఫోటోను పోస్టు చేసిన వర్మ వెంటకారపు వ్యాఖ్యలు చేశారు.

 Ramajogaiah Sastry warns RGV

రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్లపై ప్రముఖ సినీ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి స్పందించారు. కెలకమాకు సామీ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ''కెలకమాకు సామీ ...కాస్త వాతావరణం మర్చిపోతే ఆపని అందరూ చేయగలరు ...ఇది మీకు హుందా అయినది కాదు, తెలుగు ప్రజల సమయం అంత తేలికగా లేదు, ఏమన్నా ఉంటే పర్సనల్ గా ఫోన్ చేసి మాట్లాడుకోండి' అంటూ రాజజోగయ్య శాస్త్రి ట్వీట్ చేశారు.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను పొగడుతూ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ.... ఏమైందో తెలియదు కానీ కొన్ని రోజులుగా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల శ్రీరెడ్డితో పవన్ కళ్యాణ్‌ను తిట్టించి అందరితో చివాట్లు తిన్నారు. అప్పటి నుండి వర్మ మరింత రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తరచూ ఏదో ఒక పోస్టులు పెడుతున్నారు.

రవితేజ నటించిన 'నేల టికెట్' ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ఇటీవల హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను పోస్టు చేసిన వర్మ వివాదాస్పద కామెంట్స్ చేశారు. దీంతో వర్మ మీద అభిమానులు విరుచుకుపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X