'భరత్ అనే నేను' పై అంచనాలు పెరిగేలా..ఏప్రిల్ మూడవ వారంలో చరిత్ర!
మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ బాబుని ముఖ్యమంత్రిగా దర్శకుడు కొరటాల శివ అద్భుతంగా చూపించబోతున్నాడు. కొరటాల శివ, మహేష్ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీనితో భరత్ అనే నేను చిత్రంపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. ఇప్పుటికే విడుదలైన టీజర్ తో కొరటాల శివ అంచనాలు పెంచేశాడు. డైలాగులు, మహేష్ లుక్స్ అద్భుతంగా ఉండడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది.

పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి తన ట్వీట్ తో భరత్ అనే నేను చిత్రంపై మరింతగా అంచనాలు పెంచేసాడు. ఏప్రిల్ మూడవవారంలో చరిత్ర సృష్టించబోయే చిత్రం మీ ముందుకు రాబోతోందని భరత్ అనే నేను చిత్రాన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసారు. ఈ చిత్రం విషయంలో అన్ని కార్యక్రమాలు పక్కాగా సాగుతున్నట్లు ఆయన ట్విట్టర్ లో అభిమానులకు తెలిపారు.


Click it and Unblock the Notifications











