twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోమాలు నిక్కబొడుచుకుంటాయి, హృదయం కంపిస్తుంది.. అరవింద సమేత వీర రాఘవ!

    |

    Recommended Video

    Ramajogayya Shastri Writes Song For Aravinda Sametha

    ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. మతాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివా స్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ తొలి కలయికలో వస్తున్న చిత్రం ఇది. అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కొన్ని నెలల పాటు కస్టపడి మరీ సిక్స్ ప్యాక్ లుక్ సాధించాడు. అరవింద సమేత ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ కష్టం గురించి అందరికి అర్థం అయింది. సిక్స్ ప్యాక్ లోక్ లో ఎన్టీఆర్ కనిపించేసరికి అభిమానులు పిచ్చెక్కిపోయారు. అదరహో అనిపించే విధంగా అరవింద సామెత ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర సంగీతం పై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మంచి జోరుమీద ఉన్న తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

    ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు

    ఎన్టీఆర్ గురించి చెప్పనవసరం లేదు

    దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథకు అనుగుణంగా ఎన్టీఆర్ నటన ఇరగదీస్తాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. సంగీతంపై కూడా అభిమానుల అంచనాలు ఎక్కువగానే ఉంటాయి.

     రాయలసీమ నేపథ్యంలో

    రాయలసీమ నేపథ్యంలో

    దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఇలాంటి చిత్రానికి సంగీతం, బ్యాగ్గ్రౌండ్ సంగీతం చాలా కీలకం. ఆ పనిని తమన్ చాలా హుషారుగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రతి విషయాన్ని తమన్ సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో పంచుకుంటున్నాడు.

    ఆ బాధ్యతని వాళ్లిద్దరూ

    దిగ్గజ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సీనియర్ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ చిత్రానికి పాటలు అందిస్తున్నారు. ఇటీవల తనతోపాటు త్రివిక్రమ్, సిరివెన్నెల ఉన్న ఫోటోని తమన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రామజోగయ్య శాస్త్రితో ఉన్న ఫోటోని తమన్ షేర్ చేసాడు.

    రోమాలు నిక్కబొడుచుకునేలా

    తాను ఈ చిత్రంలో ఎలాంటి పాటని రాస్తున్నానో రామజోగయ్య శాస్త్రి చెప్పకనే చెప్పారు. రాఘవ నన్ను వెంటాడుతున్నారు. ఎమోషనల్ సాంగ్ రాస్తున్నా. రోమాలు నిక్కబొడుచుకునేలా, హృదయంలో ప్రకంపనలు రేగేలా, కనీటిధారలు కారేలా ఈ సాంగ్ ఉంటుందని రామజోగయ్య శాస్త్రి తెలిపారు.

    పూజా హెగ్డేతో రొమాన్స్

    పూజా హెగ్డేతో రొమాన్స్

    ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది వారి ప్లాన్.

    English summary
    Ramajogayya shastri penned emotional song for Aravinda Sametha. Trivikram Srinivas is the director. Thaman is the music director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X