రామానాయుడుకు శోభన్ బాబు స్మారక అవార్డు
ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడుని నటభూషణ శోభన్‌బాబు స్మారక అవార్డు వరించింది. ఈ విషయాన్ని ఏపీ సినీ గోయర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.బిక్షం ఒక ప్రకటనలో తెలిపారు. సంక్రాంతి రోజు జరిగే ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఇప్పటికే పద్మశ్రీ వంటి అవార్డులతో విరసిల్లుతున్న రామానాయుడుకి ఈ అవార్డు ప్రకటించటంతో సినీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక రామానాయుడు 2009 సంవత్సరంలో తమ బ్యానర్ పై నిర్మించిన బెండు అప్పారావు ఆర్.ఎంపి చిత్రం చిన్న చిత్రాలకు మళ్ళీ ఊపిరి పోసింది. ప్రస్తుతం ఆయన ఓ కుటుంబ కధా చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు కథా చర్చలు జరుపుతున్నాయి. ఇక ఆయన కుమారుడు వెంకటేష్ నటించిన నమో వెంకటేశ చిత్రం సంక్రాంతికి విడుదల అవుతోంది. ఆయన మనవడు నాగచైతన్యను వెండి తెరకు పరిచయం చేస్తూ జోష్ చిత్రం వచ్చింది. అలాగే మరో మనవడు రాణాని పరిచయం చేస్తూ లీడర్ చిత్రాన్ని రూపొందించారు. శేఖర్ కమ్ముల దర్సకత్వంలో తయారైన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











