నాయుడిగారి విరాళం 10 లక్షలు

By Staff

డాక్టర్‌ డి. రామానాయుడి గారి మంచితనం గురించి సినిమా పరిశ్రమలోనే కాదు. బయట కూడా చాలా మందికి తెలుసు. జనవరి ఫస్టు తారీఖున ఆయన స్టూడియోలో నాయుడుగారు కొన్ని నోట్ల కట్టలు దగ్గర పెట్టుకుని కూర్చుంటారు. క్యూలో వచ్చిన ఆయన స్టూడియో స్టాఫ్‌కీ, అసోసియేట్‌ డైరెక్టర్లకూ, స్డూడియోలో పనిచేయని సినీ కార్మికులకూ కూడా ఆయన మనిషికి వంద రూపాయల చొప్పున ఇస్తారు. వంద కోసం కాదు గానీ.. ఆయన చేతుల మీదుగా వంద నోటు తీసుకున్న వారికి ఆ ఏడాది అంతా మంచి జరుగుతుందని చాలామంది నమ్మిక. అందుకోసం కూడా వెళ్లేవారుంటారు. బాపట్ల పార్లమెంట్‌ సభ్యునిగా రామానాయుడు తమ నియోజకవర్గంలో చేసిన పనులు ఇప్పటికీ జనం చెప్పుకునే విధంగా ఉన్నాయి.

రాష్ట్రంలో గత రెండు వారాలుగా వరదలు ముంచెత్తడంతో బాధితుల గోడు తెలిసి స్పందించిన డాక్టర్‌ రామానాయుడు ఆదివారంనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలుసుకుని రూ. 10 లక్షల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేశారు. అన్నార్తులను ఆదుకోవడంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన మరోమారు మార్గదర్శి అయ్యారు.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X