రామానాయుడి సినిమాలో కుర్ర హీరోయిన్?
ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో ఉన్న సీనియర్ ప్రొడ్యూసర్లలో డి. రామానాయుడు ఒకరు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తీశారు. ఎంతో మంది హీరోలను, హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశారు. అందుకే సినీ పరిశ్రమకు వచ్చిన చాలా మంది ఆయన దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకే ఆయన 'మూవీ మొఘల్' అయ్యారు.
ప్రస్తుతం అరవింద్ కృష్ణ, సుప్రియా శైలజా జంటగా 'ఋషి' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రంలో నటిస్తున్న హీరోయిన్ సుప్రియా శైలజ రామానాయుడ్ని ఆకర్షించినట్లు చెబుతున్నారు. తర్వలో తాను తీయబోయే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల 'ఋషి' ఆడియో ఫంక్షన్లో సుప్రయా శైలజ రామానాయుడుతో క్లోజ్ గా మూవ్ అవ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
రామానాయుడు నిర్మాతగా చివరి సారిగా 'ఆలస్యం అమృతం' చిత్రాన్ని వచ్చింది. అప్పటి నుంచి ఆయన నిర్మాతగా ఏ సినిమా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మంచి మెసేజ్ ఫుల్, ఎంటర్ టైన్మెంట్ చిత్రంతో ఈ సంవత్సరం ఖాతా తెరవాలనే ఆలోచనలో ఉన్నారని, ఇందులో సుప్రియ శైలజను ప్రధాన నాయికగా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











