మేం చేసేది డబ్బు సంపాదన కోసం కాదు: డి సురేష్ బాబు
ధనార్జన కోసం ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయలేదు. ఔత్సాహికుల ప్రోత్సాహం నిమిత్తం మేం నాన్నగారి పేరుమీద ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌ని స్థాపించాం. పరిశ్రమకు సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించి పలు కోర్సులను ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో ఏర్పాటు చేశాం అంటున్నారు ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు. ఆయన స్థాపించిన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కార్యాచరణ ప్రణాళికల వివరాలు ఆయన మీడియాకు తెలియచేస్తూ పై విధంగా మాట్లాడారు. అలాగే...మా ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సును కూడా కొత్తగా ప్రవేశపెడుతున్నాం. శిక్షణ పొందగోరు వారు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.
దరఖాస్తులను మా స్కూలు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తక్కువ ధరకు నాణ్యమైన కోర్సులను అందిస్తున్నాం. దరఖాస్తులను పరిశీలించాక నిజంగా సినిమా మీద అవగాహన ఉండి ఖర్చులను భరించలేని వారిని ఎంపిక చేసి సాయం చేస్తాం. మా దగ్గర శిక్షణ పొందిన వారికి వారి ప్రతిభ ఆధారంగా అవకాశాలను కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే సంస్థ స్థాపించిన తర్వాత ఇది మూడో బ్యాచ్. తొలి బ్యాచ్ విద్యార్థుల శిక్షణ సెప్టెంబరుతో పూర్తికానుంది అని డి.సురేష్ బాబు చెప్పారు. అలాగే తమ సంస్ధ తీయబోయే చిత్రాలు గురించి మాట్లాడుతూ...ఈ ఏడాదిలోపు వెంకటేష్, రాణాలతో సురేష్‌ప్రొడక్షన్స్ లో సినిమాలు ఉంటాయని, తేజ, గౌతమ్ మీనన్, సెల్వరాఘవన్ ఈ సినిమాలకు దర్శకత్వం వహిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇక స్కూల్ ఎడ్రస్ http://www.ramanaidufilmschool.com
.


Click it and Unblock the Notifications











