రామానాయుడు ఇన్ యాక్షన్
వందకు పైగా చిత్రాలు నిర్మించి ఇంకా అలుపెరగని శ్రామికుడిగా సినీ నిర్మాణంలో తలమునకలవుతున్న ప్రముఖులు డి. రామానాయుడు. సినిమా ద్వారా తను సంపాదించిన డబ్బును తిరిగి పరిశ్రమ మీదనే ఖర్చు చేసి.. ఆదర్శ నిర్మాతగా ఎదిగిన ఆయన కొద్దికాలం పాటు వరుస వైఫల్యాలు తగిలి సినీ నిర్మాణాన్ని ఆపేశారు. అయితే, క్రియాశీలక రాజకీయాల నుంచి విరామం తీసుకున్న ఆయన తిరిగి తన శక్తియుక్తులన్నీ సినీ నిర్మాణం కోసమే ఉపయోగించే పనిలో పడ్డారు.
హోప్ చిత్రం ద్వారా మంచి నటుడు కూడా అని నిరూపించుకున్న రామానాయుడు - ఆ స్ఫూర్తితో ఒక ఫుల్ లెంగ్త్ కమర్షియల్ పాత్ర చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ప్రయోగం కూడా ఆయన స్వీయనిర్మాణంలోనే తలపెట్టడం విశేషం. రామానాయుడు నిర్మాతగా ఆయన తనయుడు వెంకటేశ్ హీరోగా గాడ్‌ఫాదర్ అనే కథను తెరకెక్కించడానికి రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారు.
భూపతిరాజా చెప్పిన ఒక కథ ఆయనకు బాగా నచ్చి, హీరోగా వెంకటేశ్ చేస్తే తండ్రిగా తనే నటించడానికి రామానాయుడు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రామానాయుడు సుమంత్ హీరోగా స్నేహ, పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా రామానాయుడు ఒక చిత్రాన్ని అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించబోతున్నారు. అది పూర్తయిన వెంటనే వెంకటేశ్ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేలా ఆయన ప్లాన్ చేస్తున్నారు. నిజజీవితంలో సుప్రసిద్ధులైన తండ్రీకొడుకులు ఇద్దరూ తొలిసారి నటించే చిత్రం ఇదే అయితే.. అంతకన్నా విశేషం ఏముంటుంది?


Click it and Unblock the Notifications