జూ ఎన్టీఆర్ తో రామానాయుడు పోటీ?

By Bojja Kumar

నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్ కి...ప్రొడ్యూసర్ రామానాయుడికి పోటీ ఏమిటా? అని అనుమాన పడక్కర్లేదు. నిజంగానే ఇక్కడ ఈ ఇద్దరు పోటీ పడుతున్నారు. ఏవిషయంలో అంటే....ఖరీదైన బైకుల షోరూంలు ఓపెంనింగుల విషయంలో. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమండీ బాబూ. ఆ మధ్య జూ ఎన్టీఆర్ హార్లే డేవిడ్ సన్ అనే ఖరీదైన బైక్ షోరూంను ప్రారంభించిన విషయం తెలిసిందే. లక్షల్లో విలువ చేసే ఈ ద్విచక్ర వాహనాన్ని మన రాష్ట్రంలో జూనియర్ ఎన్టీఆర్ తో ఓపెన్ చేయించడం అప్పట్లో చర్చనీయాంశం అయింది.

తాజాగా ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుతో గేర్ వేర్ మోటార్స్ వారు సోమవారం హైదరాబాద్లో తమ బైక్ షోరూంను ఓపెన్ చేయించారు. ఈ బైక్ కంపెనీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించిన హార్లే డేవిడ్ సన్ కు పోటీ కంపెనీ కావడం గమనార్హం. ఇలా రెండు ప్రత్యర్థి కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ ఓపెన్ చేసిన ఈ సినిమా తారలు ఇద్దరూ పరోక్షంగా పోటీ దారులుగా మారని చర్చించుకుంటున్నారు సినీ రంగంలోని వారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X