తాత రాముడైతే మనవడు భీముడు..!
ప్రపంచంలో ఎక్కువ సినిమాలుతీసి గిన్నస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్దానం సంపాదించిన మూవీ మొఘల్ డా డి.రామానాయుడు తనదైన శైలిలో మరోక కోత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కోన్ని రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఇండియాలో చలన చిత్రాలకు చేసిన కృషికి గాను అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్దుని ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలో ఆయనను ఇవాళ ఇంతటి స్దానంలో నిలబెట్టనటువంటి సినిమా రాముడు-భీముడు. ఆ సినిమాని మరలా తిరిగి జూ ఎన్టీఆర్ తో నిర్మించకడానికి సిద్దంగా ఉన్నానని ఆయన వెల్లడించారు. రామానాయుడు ఎప్పటినుంచో ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని అనుకోవడం అది కాస్త వాయిదా పడడం జరుగుతూ వచ్చింది. కాని ఈ సారి ఈ సినిమాని తప్పనిసరిగా చెయ్యాలని తన సంసిద్దతను జూ ఎన్టీఆర్ కి చెప్పడం జరిగింది. దానితో జూ ఎన్టీఆర్ వెనువెంటనే ఆలోచించకుండా ఒప్పుకోవడం, దీనికోసం తన డేట్స్ ని కూడా సరిచేయడం జరిగిందని అన్నారు. ఇలాంటి సినిమాలను చేయడానికి జూ ఎన్టీఆర్ ఎప్పటినుండో చేయడానికి రడీగా ఉండడంతో రామానాయుడు ఆఫర్ ఇవ్వడం జూ ఎన్టీఆర్ ఒప్పేసుకోవడం జరిగిందన్నారు. ఈ సినిమాని రామానాయుడు సురేష్ ప్రోడక్షన్స్ బేనర్ లో నిర్మిస్తారని తెలిపారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ నటించిన బృందావనం అక్టోబర్ నెలలో విడుదలకు సిద్దంగా ఉంది. వీటితో పాటు సి. అశ్వినిదత్ నిర్మాత గా మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











