ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడు హఠాత్తుగా గాంధీభవన్ కు వచ్చారు. అదే సమయంలో అక్కడే వున్న ఓ ఉషారైన కాంగ్రెస్ కార్యకర్త ఉత్సాహంగా ఆయన మెడలో పార్టీ కండువా వేశారు. అయితే రామానాయుడు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాలేదు. కాంగ్రెస్ ప్రచార గీతం 'జయహో'(జననేత వైఎస్ జైత్రయాత్ర)పేరిట పసుమర్తి నాగేంద్రకుమార్ రచించిన పుస్తకాన్ని..రచయిత విజ్ఞప్తి మేరకు పుస్తకం కాపీని స్వీకరించడానికి రామానాయుడు గాంధీ భవన్ కు వచ్చారు. ఆర్ధికక మంత్రి, పిసిసి ప్రచార కమిటీ చైర్మన్ కె.రోశయ్య ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. అనంతరం తొలి కాపీని రామానాయుడుకు అందజేశారు. తర్వాత మీడియావారు రామానాయుడుని..ఏమిటీ..కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా? అని అడిగితే, 'రచయిత పిలిస్తే వచ్చాను. రాజకీయాల్లోకి రాకముదు నేను, రోశయ్య మంచి మిత్రులం. గతంలో రైస్ వ్యాపారం చేశాం' అని ఆయన జవాబిచ్చారు. రామానాయుడుతో రాజకీయాలు మాట్లాడలేదని రోశయ్య చెప్పారు. అదీ సంగతి..