ఫాల్కే అవార్డు అందుకున్న సినీ మొఘల్ రామానాయుడు
జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవంలో శుక్రవారం తెలుగు మూవీ మొఘల్ డి.రామానాయుడుకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అందించారు. 'పా'లో నటనకు గానూ ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్ అవార్డు తీసుకున్నప్పుడు ఆహూతులందరూ లేచి నిలబడి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయనకు ఉత్తమ నటుడిగా రజత కమలం లభించింది. '3 ఇడియట్స్' నిర్మాత విధు వినోద్ చోప్రా స్వర్ణకమలాన్ని అందుకున్నారు. మలయాళ సినిమా 'కుట్టి శ్రాంక్' అధికంగా ఐదు అవార్డులను కొల్లగొట్టింది.
'కుట్టి శ్రాంక్' చిత్రానికి గానూ ఉత్తమ నిర్మాత, దర్శకులుగా రిలయన్స్ బిగ్ పిక్చర్, షాజి ఎన్ కరుణ్ ఎంపికై, రాష్ట్రపతి చేతుల మీదుగా స్వర్ణ కమలాన్ని అందుకున్నారు.రాకేశ్ ఓం ప్రకాశ్ నిర్మించిన 'ఢిల్లీ 6', ఉత్తమ చలన చిత్రంగా నర్గిస్ దత్ అవార్డును అందుకుంది. ఇక బాలల చిత్రాల్లో ఉత్తమ చిత్రం అవార్డును కన్నడ చిత్రం 'పుతాని పార్టీ', మలయాళం చిత్రం 'కేశు'లు పంచుకున్నాయి.


Click it and Unblock the Notifications











