జూ ఎన్టీఆర్ తో రామానాయుడు ఆ రీమేక్?
జూనియర్ ఎన్టీఆర్ ను అడిగాను. చేస్తానన్నాడు అంటూ ఎన్నాళ్ళగానే రామానాయుడు మనస్సులో ఉన్న రాముడు-భీముడు రీమేక్ గురించి చెప్పుకొచ్చారు. తమ భ్యానర్ లో వచ్చిన సినిమాల్లో తిరిగి రీమేక్ చేద్దామనుకుంటున్న వాటి గురించి పై విధంగా వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాలు ప్రస్ధావించారు. అలాగే నాగేశ్వరరావుతో చేసిన ప్రేమనగర్ కూడా ఎలా తీయాలా అని ఆలోచిస్తున్నాను. బొబ్బిలిరాజా కూడా ఆ రీమేక్ లిష్టులో ఉందని చెప్పారు. ఇక రాముడు-భీముడు చిత్రం తనకు లైఫ్ ఇచ్చిందనే సంగతులు గుర్తు చేసుకున్నారు. 1963లో సురేష్‌బాబు పేరుతో సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి రాముడు-భీముడు ప్రారంభించాను. 1964 మేలో రిలీజ్ చేశాను అన్నారు. అలాగే నా జీవితంలో రాముడు-భీముడు విత్తనమైతే, ప్రేమనగర్ వృక్షంలాంటిది. ప్రేమనగర్‌తోనే నేను పరిశ్రమలో పూర్తిస్థాయిలో స్థిరపడిపోయాను అంటూ చెప్పుకొచ్చారు. అంటే త్వరలో ఎన్టీఆర్ తన తాతగారు నటించిన రాముడు-భీముడు చిత్రంలో చేయనున్నారన్నమాట. ప్రస్తుతం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన అదుర్స్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. అందులో ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా నటించారు. వి.వి.వినాయిక్ డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











