రామానాయుడుతో ‘తుపాకి’ ఆడియో రిలీజ్(ఫోటోస్)
హైదరాబాద్: తమిళ హీరో విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం తమిళ చిత్రం 'తుపాకి'. ఈచిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు హక్కులను ఎస్వీఆర్ సంస్థ అధినేత్రి శోభారాణి దక్కించుకున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియోను సోమవారం హైదరాబాద్ లోని శిల్ప కళా వేదికలో విడుదల చేసారు. ప్రముఖ నిర్మాత, దాదా పాల్కే అవార్డు గ్రహీత డి. రామానాయుడు ఈ చిత్రం ఆడియో ఆవిష్కరించారు.

డాక్టర్ డి. రామానాయుడు తుపాకి మూవీ తెలుగు వెర్షన్ ఆడియో శిల్పకళా వేదికలో ఆవిష్కరించారు. తొలి సీడీలను హీరో విజయ్, హీరోయిన్ కాజల్, దర్శకుడు మురుగదాస్ లకు అందించారు.

రామానాయుడు మాట్లాడుతూ... తమిళనాడులో యువ సూపర్ స్టార్ విజయ్, ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన మురుగదాస్, హారిష్ జైరాజ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి కాంబినేషన్ మంచి విజయం సాధించి శోభ గారికి మంచి లాభాలు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు.

హీరో విజయ్ తో రామానాయుడు ముచ్చట్లు.

ఆడియో విడుదల వేడుకపై నవ్వుల చిందిస్తున్న హీరో విజయ్, హీరోయిన్ కాజల్, దర్శకుడు మురుగదాస్

ఆడియో వేడుకలో డాన్సర్ల ప్రదర్శన ఆకట్టుకుంది.

ఈ చిత్రం తెలుగు హక్కులను ఎస్వీఆర్ సంస్థ అధినేత్రి శోభారాణి దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ...తమిళనాడులో యువ సూపర్ స్టార్ విజయ్, ఇండియాలోని గొప్ప దర్శకుల్లో ఒకరైన మురుగదాస్, హారిష్ జైరాజ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి కాంబినేషన్ మంచి విజయం సాధించి శోభ గారికి మంచి లాభాలు తేవాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ ప్రముఖులు బెల్లంకొండ సురేష్, సిజె శోభారాణి, రమేష్ పుప్పాల, సి కళ్యాణ్, బిఎ రాజు, గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











