twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ములపై అసంతృప్తి

    By Staff
    |

    Rana
    శేఖర్ కమ్ముల పై ప్రముఖ నిర్మాత రామానాయుడు చాలా అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అయితే సినిమా బాగోలేదనో,మరెందుకో కాదు ఆ నిరసన. తన మనవడు రాణాని పరిచయం చేస్తూ తీస్తున్న సినిమా షూటింగ్ రాత్రిళ్ళు జరుగుతోంది. అది ఆయన ఇష్టపడటం లేదు. ఈ విషయమై మాట్లాడుతూ..మేమూ మా బ్యానర్ లో ఎన్నో సినిమాలు తీసాం..విజయాలు సాధించాం. అయితే సమయ పాలన విషయంలో చాలా ప్రొపిషనల్ గా ఉండేవాళ్ళం.

    నా మనవుడు రాణా షూటింగ్ అంతా చీకటి పడ్డాకే జరుగుతోంది.రాణా అనే కాదు ఆర్టిస్టు ఎవరైనా రాత్రిళ్ళు మెలుకవగా ఉంటే ముఖంలో ఉండాల్సిన గ్లో ఉండదు.ఇది గ్లామర్ ఫీల్డ్..ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శక,నిర్మాతలపై ఉంది.ఇవాళ యువరక్తంతో చేసే ఈ పనులు తర్వాత లాంగ్ రన్ లో దెబ్బ తీస్తాయి. అయినా నా మనవలు పది లోపల పడుకోవటం చూసే నేను నిద్రకు వెళ్ళటం అలవాటు. ఈ శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం అయ్యాక వాడితో మాట్లాడటం కూడా కుదరలేదు అంటూ ఆవేదనతో చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X