ప్రముఖ నిర్మాత డి రామానాయుడు 2008 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కాడు. తొమ్మిది భాషలలో సినిమాలు నిర్మించి రామానాయుడు ఈ ఘనతను సాధించాడు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ, ఒరియా, అస్సామీస్ భాషలలో రామానాయుడు తన సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సినిమాలు నిర్మించాడు. ఇతర భాషలలోని సినిమాలను డబ్బింగ్ చేయకుండా ఆయా భాషలలోనే నేరుగా సినిమాలను నిర్మించడం రామానాయుడుకున్న అలవాటు.
Story first published: Saturday, June 6, 2026, 21:19 [IST]